క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. భార‌త్‌లో కూడా రోజు రోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణ‌లో కూడా క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. ఈరోజు కొత్త‌గా మ‌రో ముగ్గురు క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌ 36కు చేరింది.

తెలంగాణ‌లో కొవిడ్‌-19(క‌రోనా) బాధితుల సంఖ్య అధికంగా పెరిగిన‌ట్ల‌యితే.. ఖాళీగా ఉన్న తెలంగాణ సెక్రటేరియట్‌ని ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు బండి సంజయ్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ నివార‌ణకు చేప‌ట్టిన చ‌ర్య‌లు, లాక్‌డౌన్ ప‌రిస్థితుల‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యున్న‌త‌స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన ఈ స‌మీక్ష‌కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌, సీఎస్ సోమేశ్‌కుమార్‌, డిజిపి మ‌హేందర్ రెడ్డి స‌హా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు. లాక్‌డౌన్‌కు ప్ర‌జ‌ల స‌హ‌కారం ఎలా ఉంది. క‌రోనా క‌ట్ట‌డికి వివిధ జిల్లాల్లో చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను సీఎం అడిగి తెలుసుకున్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.