ఎన్సీపీ అధినేత‌తో బీజేపీ ఎంపీ భేటీ.. మ‌హారాష్ట్ర‌లో అస‌లేం జ‌రుగుతుంది.?

By Medi Samrat  Published on  24 Nov 2019 5:45 AM GMT
ఎన్సీపీ అధినేత‌తో బీజేపీ ఎంపీ భేటీ.. మ‌హారాష్ట్ర‌లో అస‌లేం జ‌రుగుతుంది.?

మహారాష్ట్ర‌ రాజకీయ ప‌రిణామాల‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగ‌నుంది. ఈ ఉదయం 11.30గంటలకు గవర్నర్ తీరుపై శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ప్రారంభం కానున్నాయి. సుప్రీం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిష‌న్‌పై వాద‌న‌లు విన‌నుంది.

అస‌లే గ‌రం గ‌రంగా న‌డుస్తున్న మ‌హా రాజ‌కీయాల‌లో మ‌రో ఊహించ‌ని మ‌లుపు చోటుచేసుకుంది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ ఇంటికి బీజేపీ ఎంపీ సంజయ్ కకాడే వెళ్లడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ప‌వార్ నివాసానికి సంజయ్ చేరుకున్నారు. ఆయనతో పాటు ఎన్సీపీ సీనియర్ నేత‌ జయంత్ పాటిల్ కూడా ఉన్నారు. సుప్రీంలో వాదనలు నేఫ‌థ్యంలో ఎన్సీపీ అధినేత‌తో బీజేపీ ఎంపీ భేటీ కావడం స‌రికొత్త చ‌ర్చ‌కు ఊత‌మిస్తుంది.

Next Story