ప్రభుత్వ ఉద్యోగిని చెప్పుతో కొట్టిన బీజేపీ నాయకురాలు.. టిక్‌టాక్‌ స్టార్‌ సొనాలీ ఫోగట్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jun 2020 6:08 PM IST
ప్రభుత్వ ఉద్యోగిని చెప్పుతో కొట్టిన బీజేపీ నాయకురాలు.. టిక్‌టాక్‌ స్టార్‌ సొనాలీ ఫోగట్‌

హరియాణా బీజేపీ నాయకురాలు, టిక్ టాక్ స్టార్ సొనాలీ ఫొగాట్ మరో వివాదంలో చిక్కుకుంది. ఓ ప్రభుత్వాధికారిని ఆమె చెప్పుతో కొట్టారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సొనాలీ ఫొగాట్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

Next Story