హోమ్ క్వారంటైన్‌కు బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి
By సుభాష్ Published on 24 April 2020 8:15 AM ISTదేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డిని కదిరిలో హోమ్ క్వారంటైన్ చేశారు. ఈ మేరకు పోలీసులు గురువారం ఆయన ఇంటి బయట గేట్‌కు నోటీసులు అతికించారు. విష్ణువర్ధన్ నిన్న కర్నూలుకు వెళ్లి రావడంతో కరోనా వ్యాప్తి నివారణలోభాగంగా పోలీసులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజా నోటీసుల ప్రకారం 28 రోజుల పాటు ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది. ఒక వేళ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
కాగా, ఇప్పటికే ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గురువారం ఏపీ ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ ప్రకారం.. నిన్న కొత్తగా 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 893 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 141 మందిని డిశ్చార్జ్ అయ్యారు. ఇక 27 మంది మృతి చెందారు. కాగా, నిన్న ఉదయం 9గంటల నుంచి గురువారం 9 గంటల వరకు 6522 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. ప్రస్తుతం 725 మంది చికిత్స పొందుతున్నారు.
ఇక కర్నూలు జిల్లాలో 31, గుంటూరు 18, చిత్తూరు 14, అనంతపురం 6, తూర్పుగోదావరి 6, కృష్ణ 2, ప్రకాశం 2,విశాఖ జిల్లా నుంచి ఒకటి చొప్పున కొత్తగా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికగా కర్నూలు జిల్లాలో 234 కేసులు, గుంటూరు జిల్లాలో 195 కేసులు నమోదయ్యాయి.