మా కార్యకర్తలకు ఆ శక్తి ఉంది
By Newsmeter.Network Published on 25 Jan 2020 7:59 PM ISTదేశంలో అతి పెద్ద పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. మోదీ నాయకత్వంలో దూకుడుగా ముందుకు వెలుతూ.. ఇటు తెలంగాణలోనూ వడి వడిగా అడుగులు వేస్తోంది బీజేపీ. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్మణ్ తో ఇంటర్వూ...
ప్రశ్న : ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు ఎలా ఉంటాయి...?
లక్మణ్ : మున్సిపల్ ఎన్నికలు జరిగిన తీరు చూస్తుంటే.. ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురైంది. ఓటర్ లిస్టు నమోదు నుంచి మొదలు పెడితే.. అవకతవకలు వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ వరకు అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేయాలో అన్నికుట్రలు చేసింది. గెలుపు కోసం పడరాని పాట్లు పడింది. దానికి తోడు కనీసం ఫిర్యాదు చేయడానికి కూడా అవకాశం లేకుండా ఆ షెడ్యూల్ ను ప్రకటించి, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అంటే పూర్తిగా అధికార పార్టీ చెప్పు చేతల్లో నడిచే విధానం మొదటి సారిగా తెలంగాణలో చూస్తున్నాం. ఎన్నికల కమిషనరే స్వయంగా బాహాటంగా మున్సిపల్ చట్టానికి ఏదైతే సవరణ జరిగిందో దాని కనుగుణంగా ప్రభుత్వాన్ని కాదని చేయలేని పరిస్థితి ఆ చట్టంలో ఉందని, నిస్సాయున్ని అని వారు చెప్పకనే చెప్పారు. ఇక ధన ప్రవాహాం చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఎన్నికలు అంటే డబ్బు. ప్రజాస్వామ్యం కాదు.. ఇది ధన స్వామ్యం.. డబ్బులేనిది ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చే వారికి స్థానం లేని పరిస్థితిని కేసీఆర్ మహాప్రభు కల్పిస్తున్నాడు. ఇవాళ వారు అక్రమంగా సంపాదించిన డబ్బును, అవినీతి ద్వారా ప్రోగుచేసిన సొమ్ములను రాజకీయంగా ఓట్ల కొనుగోలు కోసం. వారు ఎమ్మెల్యేను, ఎంపీలను కొనుగోలు చేసే సత్తా ఉన్నటువంటి నాయకం. ఇవాళ కౌన్సిలర్లు ఎన్నికల్లో ఎంత మరి వారు దిగజారిన రాజకీయాలకు పాల్పడుతున్నారు. అయిన ధీటైన పోటి ఇవాళ బీజేపీ ఇవ్వగలిగామనే సంతృప్తి మాకు ఉంది.
ప్రశ్న : పోల్ మ్యానేజ్ మెంట్ అనేది అధికార పార్టీ చేయడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఆ ప్రభావం ఓటర్లపై ఉంటుందా...?
లక్మణ్ : పోల్ మ్యానేజ్ మెంట్ అంటే పోల్ మ్యానేజ్ మెంట్ కాదు ఇవాళ. అవినీతినికి ఓట్లు ఏవిధంగా కొనుగోలు చేయాలో శాస్త్రీయ పద్దతుల్లో.. ఓటుకు ఇంత రేటు. మీరు పత్రికల్లో చూస్తున్నారూ.. తులం బంగారం అని, ఫ్రిజ్ అని, టీవీలని .. ఇదేనా ప్రజాస్వామ్యం ఓట్లు వేయటంలో ఇంత నల్ల డబ్బు శాసించే పరిస్థితి ఈ ప్రభుత్వం కారణమైతే..అది క్షమించరాని నేరం. పోల్ మ్యానేజ్ మెంట్ అన్నప్పుడు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసుకోవాలి. అయినప్పటికి మేము ఇంతకముందు చెప్పినట్లుగా మేము మాకు ఉన్నటువంటి జనబలం, అభిమానము, కార్యకర్తల ద్వారా ధీటైనటువంటి పోటి ఇచ్చాం.. ఎదుర్కొన్నాం. క్షేత్రస్థాయిలో కూడా పోలీసులు, అధికార యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహారించారు. మా కార్యకర్తలపై భౌతికంగా దాడులు, అభ్యర్థులను ప్రలోభపెట్టడం దాడులు చేయడం, విరమింపచేయడం. ఇన్ని చేసినా కూడా నేను అధ్యక్షుడిగా గర్వపడుతున్నా. మొదటి విజయం సాధించింది ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొదటి స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. 85 శాతం సీట్లలో ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీ చేసి బరిలోకి దింపాం. వారు నిలబడ్డారు. ఒకవైపు నరేంద్ర మోదీ ప్రభుత్వం పనితీరు, అవినీతి రహిత పాలన అమిత్ షాతో కలిసి ఇవాళ ఏ రకమైన చారిత్రాత్మకమైన నిర్ణయాలను ఈ ప్రభుత్వం తీసుకుంటుందో ఇవన్ని కూడా వివరిస్తూ.. టీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ.. ఉదృతంగా ప్రచారం కూడా చేసాం. కాబట్టి మాకు ఎన్నికల్లో మొదటి విజయంగా అభ్యర్థులు. పోలీసుల ద్వారా ఎన్నిరకాల వేదింపులకు గురిచేసిన అభ్యర్తులు నిలబడ్డారు అంటే ప్రజల కోసం, ప్రజాహితం కోసం ప్రజాసేవకు అంకితం కావాలనే ఆలోచనతో తప్పితే పదవులను అనుభవించాలనే ధ్యాసతో కాదని నేను గర్వపడుతున్నా..
ప్రశ్న : గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేశారు.? మరీ ఎన్నిస్థానాల్లో విజయం సాధిస్తారా..?
లక్మణ్ : గతంలో ఏనాడు సాధించలేనటు వంటి ఓట్ల శాతాన్ని పెంచుకుంటాం. సీట్లు కూడా గణనీయంగా పెంచుకుంటాం. గతంలో తెలుగుదేశం పార్టీలో కలిసి పోటి చేసినప్పుడు ఎన్ని సీట్లు గెలిచామో అంతకంటే ఎక్కువగా గెలుస్తాం.
ప్రశ్న: ఏఏ జిల్లాల్లో బీజేపీ మెజార్టీ సాధిస్తుందని అనుకుంటున్నారూ..?
లక్మణ్ : అన్ని జిల్లాల్లో మా ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఉంటుంది. మా ప్రజాప్రతినిధులు ఉన్న చోట మెరుగైన ఫలితాలు సాధిస్తాం.. పార్టీ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉంది. అన్ని పట్టణాల్లో మా యంత్రాగం పని చేసింది. టీఆర్‌ఎస్ డబ్బుల ధాటిని, మద్యాన్ని ఎదుర్కొనే శక్తి, సామర్థ్యం మా కార్యకర్తలకు ఆ భగవంతుడు ఇచ్చాడు.
ప్రశ్న : పట్టణ ప్రాంతాల్లో బీజేపీ పై అవగాహాన ఎక్కువ. అక్కడ బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుంది..?
లక్మణ్ : అధికార పార్టీ ఏ స్థాయికి దిగజారిదంటే.. మొన్ననే గ్రామీణ ప్రాంతాల్లో మండలపరిషత్తు, జిల్లా పరిషత్తు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. అక్కడ ఉన్నటువంటి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీ చేయడానికి అనర్హత అనే నిభందనను పట్టణాల్లోకి వచ్చే సరికి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు అంటే దేనికోసం మజ్లీస్ ప్రాపకం కోసమే కదా..మజ్లీస్ మెప్పు కోసమే కదా.. ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా.. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారూ.. సీఏఏ పేరు మీద మతవిద్వేషాలు సృష్టించి టీఆర్‌ఎస్ ముసుగులో రాష్ట్ర వ్యాప్తంగా మజ్లీస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నిర్భంధాన్ని చేసిన కుట్రను కూడా ప్రజలు గమనించారు. నాకు నమ్మకం ఉంది. ప్రజలు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి కర్రుకాల్చి వాత పెడతారు అనే భరోసా నాకుంది.