బిత్తిరి సత్తి కొత్త జాబ్‌లో జాయిన్ అయ్యాడా.?

By రాణి  Published on  13 July 2020 7:00 AM GMT
బిత్తిరి సత్తి కొత్త జాబ్‌లో జాయిన్ అయ్యాడా.?

వీ6 ఛానెల్ లో తీన్మార్ వార్తల్లో చేరిన బిత్తిరి సత్తి ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. బిత్తిరి సత్తి అసలు పేరు చేవెళ్ల రవికుమార్. వీ6 లో కొన్నాళ్లపాటు పనిచేసిన బిత్తిరి సత్తి ఆ తర్వాత యాజమాన్యంతో ఏదో వివాదం కారణంగా అక్కడ మానేశాడు. వీ6లో ఉద్యోగం మానేసిన కొద్ది రోజులకు టీవీ9లో వచ్చే ఇస్మార్ట్ న్యూస్ లో ప్రత్యక్షమయ్యాడు. ఇస్మార్ట్ న్యూస్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

ఇస్మార్ట్ న్యూస్ చూడనిదే రోజు గడవని వాళ్లు కూడా ఉన్నారంటే అతిశయోక్తే కదా. కానీ ఈ మధ్యకాలంలో టీవీ9 లో కూడా కనిపించడం లేదు బిత్తిరి సత్తి. దీంతో బిగ్ బాస్ 4 కోసం బిత్తిరి సత్తి టీవీ9 లో ఉద్యోగం మానేశాడన్న వార్తలు వచ్చాయి. కానీ తాజాగా తెలిసిన విషయం ఏంటంటే..టీవీ9 యాజమాన్యంతో కూడా బిత్తిరి సత్తికి ఏదో వివాదం జరిగిందట. అందుకే అక్కడ ఉద్యోగం మానేశాడని చెప్పుకుంటున్నారు నెటిజన్లు.

ప్రస్తుతం బిత్తిరి సత్తి సాక్షి టీవీలో చేరినట్లు సమాచారం. వీ6 తీన్మార్ వార్తలు, టీవీ9 ఇస్మార్ట్ న్యూస్ తరహాలోనే సాక్షి టీవీ కూడా బిత్తిరి సత్తితో ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సాక్షి టీవీ సత్తికి ఆఫర్ చేసిన శాలరీ ఎంతంటే.. అక్షరాలా రెండున్నర లక్షలని టాక్. ఈ శాలరీ టీవీ9 ఇచ్చి జీతం కన్నా ఎక్కువట. నిజంగానే బిత్తిరి సత్తి సాక్షిలో చేరాడా ? లేక బిగ్ బాస్ కోసమే టీవి9లో మానేశాడా ? అన్న విషయం సత్తి మళ్లీ తెరమీద కనిపిస్తే గానీ తెలియని పరిస్థితి.

Next Story