5పైసలకే బిర్యాని ప్యాకెట్..!!!
By న్యూస్‌మీటర్ తెలుగు
తమిళనాడు: ఐదు పైసలకే ప్యాకెట్ బిర్యాని... అవునండీ ఇది నిజం. కాకపొతే, కేవలం బుధవారం ఒక్క రోజే ఈ ఆఫర్ ఇచ్చాడు తమిళనాడులోని ఓ హోటల్ యజమాని. డిండుక్కల్ కు చెందిన షేక్ ముజుబుర్ రెహ్మాన్ ఇచ్చిన ఆఫర్ బిర్యానీ ప్రియులకు బంపర్ ఆఫర్ అయింది. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ముజుబుర్ రెహ్మన్ ఈ ఆఫర్ ఇచ్చాడు. రూ.90అ బిర్యానిని కేవలం 5 పైసలకి అమ్మాడు.
ముందు నుంచే ప్యాకెట్ బిర్యాని 5 పైసలకి అందిస్తున్నామని విస్తృతంగా ప్రచారం జరగడంతో చాలామంది 5 పైసలు పట్టుకొని కొట్టు ముందు క్యూ కట్టారు. వారందరి పేర్లూ, సెల్ నంబర్లూ తీసుకొని బిర్యానీ అందించాడు. పురాతన వస్తువులూ, సాంప్రదాయాలూ ఎంతో ముఖ్యమైనవి, అలాగే మనం ఉపయోగించిన వస్తువులూ, నాణేలు భావితరాల కోసం భద్రపరచడం కూడా అంతే అవసరం. అందుకే, ఇప్పుడు వాడుకలో లేని 5 పైసల నాణేలు అసలు ఎంతమంది సంపాదించగలరో తెలుకోవాలనే ఈ ప్రయత్నం చేసానని ముజీబుర్ చెప్తున్నాడు.