సాధారణంగా ఒకే కాన్పులో ఒకరు, లేదా ఇద్దరు జన్మించడం చూసే ఉంటాం. కానీ ముగ్గురు శిశువులు జన్మించడం చాలా అరుదు. అలాంటి సంఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఓ మహిళకు ఒకే కార్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. రాజంపేటకు చెందిన కాశీ విశ్వనాథ్‌ భార్య ప్రతిమ కాన్పు కోసం కడప రిమ్స్‌ ఆస్పత్రిలో చేరగా, ఆదివారం వేకువజామును ప్రసవించింది. ఈ కాన్పులో ముగ్గురు శిశువు జన్మించారు. వీరిలో ఇద్దరు ఆడ పిల్లలు, ముగ్గురు మగ శిశువు జన్మించారు. ఒకేసారి ముగ్గురు పుట్టడంపై వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. ముగ్గురు పిల్లలను పిల్లల వార్డులో ఉంచారు.

జన్మించిన ముగ్గురు పిల్లలతో పాటు తల్లి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ముందు జాగ్రత్తగా వారిని అబ్జర్వేషన్లో పెట్టామన్నారు. ఇక ఒకే కాన్పులో ముగ్గురు జన్మించడంపై ఆమె భర్త సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి.

సుభాష్

.

Next Story