మళ్లీ యాక్టివ్‌గా బాలాకోట్ శిబిరం: బిపిన్ రావత్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Sep 2019 8:56 AM GMT
మళ్లీ యాక్టివ్‌గా బాలాకోట్ శిబిరం: బిపిన్ రావత్

చెన్నై: బాలాకోట్ ఉగ్ర శిబిరంలో మళ్లీ టెర్రరిస్ట్‌ల కదలికలు మొదలయ్యాయని భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ చెప్పారు. జైష్ ఉగ్రవాదులు మళ్లీ యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపారు. ఉగ్రవాదులు తమ కార్యకలాపాలు మళ్లీ ప్రారంభించారంటే అక్కడ షెల్టర్‌ ఉందనే అర్ధమన్నారు. ఈసారి బాలాకోట్‌కు మించి ప్రతిదాడులు ఉంటాయని బిపిన్ రావత్ హెచ్చరించారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమిలో రావత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Image result for balakot attack

కశ్మీర్‌లో ఏదో జరుగుతుందని ప్రపంచానికి పాక్‌ చెప్పాలని చూస్తుందన్నారు రావత్. లోయలో శాంతియుత వాతావరణం ఉందన్నారు. కేవలం ఉగ్రవాదుల మధ్య మాత్రమే కమ్యూనికేషన్ లేదన్నారు. సాధారణ ప్రజలు బాగానే ఉన్నారని, బంధువులతో మాట్లాడుకుంటున్నారని చెప్పారు రావత్.

Image result for kashmir people

ఫిబ్రవరిలో మానవబాంబ్‌ దాడిలో 40 మంది సీఆర్‌ఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే .దీంతో భారత వాయుసేన పీవోకేలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్ పై దాడి చేసింది. జైషే శిబిరాన్ని నేలమట్టం చేసింది. ఈ దాడిలో చాలా మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు సైన్యాధికారులు ప్రకటించారు.

Next Story