వాతావరణ మార్పుల వల్ల రానున్న 50 ఏళ్లలో ప్రపంచంలో ఉన్న జీవ వైవిధ్యంలో మూడింట ఒకవంతు జీవ, జంతువులు పూర్తిగా అంతరించిపోతాయి. ఈ విషయంలో సమస్య కొండంత. కానీ ప్రపంచం చేస్తున్నది గోరంతే. అమెరికాలోని ఆరిజోనా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 2070 నాటికి అంతరించిపోయే జంతువులు, వృక్షాల విషయంలో విస్తృత అధ్యయనాలు చేసి, అంతరించిపోయే అవకాశాలున్న జీవాల జాబితా తయారు చేశారు. ఇప్పటికే అంతరించిపోయిన జీవ జంతువుల వివరాల ఆధారంగా వారు ఈ అంచనా వేయగలిగారు. ప్రపంచవ్యాప్తంగా వంద జాతుల పోకడలను అధ్యయనం చేయడం ద్వారా వారు ఈ జాబితాను రూపొందించగలిగారు. ఈ వివరాలన్నీ పీ ఎన్ ఏ ఎస్ అనే పరిశోధనా పత్రికలో ప్రచురితమయ్యాయి.

ప్రపంచంలోని 581 స్థలాలలో ఉన్న 538 జాతుల వివరాలను వీరు సేకరించారు. ప్రతి పదేళ్లకు ఒక సారి ఈ జాతుల జనాభా వివరాలను సేకరించి, వాటి ద్వారా అంతరించిపోయే జాతులను గుర్తించగలిగారు. ఈ 581 స్థలాలలో జరుగుతున్న వాతావరణ మార్పులను కూడా వీరు రికార్డు చేశారు. వాతావరణ మార్పులకు, జాతులు అంతరించిపోవడానికి మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని ఆవిష్కరించగలిగారు. ఈ 538 ప్రాణుల్లో 44 శాతం ఇప్పటికే అంతరించిపోయాయని కూడా వారు ధ్రువీకరించారు. వాతావరణ మార్పులను గుర్తించేందుకు వారు 19 రకాల కొలమానాలను స్వీకరించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి జంతువులు ఎలా తప్పించుకోగలుగుతున్నాయన్న విషయాన్ని కూడా శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. వీటన్నిటి ఆధారంగానే సశాస్త్రీయంగా అంతరించిపోయే జాతుల విషయంలో ఖచ్చితమైన అంచనాకు రాగలిగారు.

సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న సమయాలను వారు తమ అధ్యయనాలకు ప్రాతిపదికలుగా ఎంచుకున్నారని ఈ పరిశోధనా బృందం నాయకుడు క్రీస్టియన్ రోమన్ పాలకోయిస్ చెప్పారు. చాలా జంతువులు వాతావరణ మార్పులు సంభవిస్తున్న ప్రదేశాల నుంచి దూరంగా వెళ్లలేవని . ఫలితంగా వాతావరణ మార్పులను తట్టుకోలేక అంతరించిపోతాయని పరిశోధనలు వెల్లడించాయి. జంతువులు వాతావరణంలో వచ్చే మార్పులను కొంత మేరకు మాత్రమే సహించగలవు. ఆ తరువాత వాటి మనుగడ అసాధ్యమౌతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల సెల్సియస్ పెరిగినా యాభై శాతం జంతువులు తట్టుకోలేవని ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. ఉష్ణోగ్రత 2.9 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరిగితే 90 శాతం జంతువులు అంతరించిపోతాయని కూడా అధ్యయనం చెబుతోంది.2.9 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే ఏమౌతుందో తెలుసా?

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.