హైదరాబాద్‌లో ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

By సుభాష్  Published on  21 May 2020 10:04 AM GMT
హైదరాబాద్‌లో ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌లో బయోడైర్సిటీ జంక్షన్ వద్ద ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా నిర్మాణం జరిగిన మొదటి దశ ఫ్లైఓవర్‌ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు గురువారం ప్రారంభించారు.

రూ.30.26 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌తో గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు రాయదుర్గం వెళ్లే వాహనాలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు దూరం కానున్నాయి. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కాగా, ఈ ఫ్లైఓవర్‌తో నగర ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగనున్నాయి. సిటీలో ఎక్కడికెళ్లాలన్న ట్రాఫిక్‌ కారణంగా గంట గంటల సమయం పట్టేది. హైదరాబాద్‌ నగరం అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది ట్రాఫిక్‌ కష్టాలు. తాజాగా ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణంతో వాహనదారులకు శుభవార్తేనని చెప్పాలి. అందుకంటే గచ్చిబౌలి-మెహిదీపట్నం మార్గంలో ట్రాఫిక్‌ చాలా ఉంటుంది.

ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఎస్‌ఆర్‌డీపీ ప్యాకేజీ కింద రూ.379 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన జెఎన్‌టీయు నుంచి బయోడైవర్సిటీ వరకూ 12 కిలోమీటర్ల కారిడార్‌ పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఈ ప్యాకేజీలో భాగంగా ఇప్పటి వరకూ దు పనులు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకుచ్చారు.

కాగా, రూ. 30.26 కోట్లతో మొదటి దశ ఫ్లై ఓవర్‌ పనులు పూర్తయినట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపిన విషయం తెలిసిందే. దీని పొడవు 690 మీటర్లు, 11.50 మీటర్లు. మూడు లైన్లు ఉండే ఈ ఫ్లై ఓవర్‌పై అన్ని రకాల వాహనాలను అనుమతించనున్నారు.

Next Story