బిహార్: కోర్ట్ ఆదేశాల మేరకు 49 మందిపై పెట్టిన దేశద్రోహం కేసులను మూసివేయాలని బిహార్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఈ 49 మంది గతంలో దేశంలో ఒక వర్గంపై జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. దీంతో బిహార్‌కు చెందిన సుధీర్ కుమార్‌ ఓజు అనే అడ్వొకేట్ స్థానిక కోర్ట్‌లో పిటిషన్ వేశారు. చీఫ్‌ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ సెక్షన్‌ 156(3)కింద ఎఫ్ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. ప్రతిపక్ష పార్టీలు విమర్శలకు పదును పెట్టాయి. 49 మందికి సంఘీభావం ప్రకటిస్తూ 189 మంది సెలబ్రిటీలు మరో లేఖ రాశారు. ఈ తీర్పుతో తమకు సంబంధంలేదని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రకటించాయి.అయినా..ఆందోళనలు సద్దుమణగలేదు. దీంతో బిహార్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసింది. పబ్లిసిటీ కోసమే అడ్వొకేట్ సుధీర్‌ కుమార్ ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని చెప్పింది.

మరోవైపు మూకదాడులు అనే పదం భారతీయ సంస్కృతికి సంబంధించినది కాదని, ఆ పదాన్ని ఎవరు పలక వద్దంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచించారు. భారతీయ సంస్కృతితో సంబంధం లేని కొన్ని మతాలు, పాశ్చాత్య దేశాలు ఈ పదాన్ని భారత్ పై రుద్దుతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాగపూర్‌లోని విజయదశమి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ప్రజలు సామరస్యంతో జీవించాలని, ప్రతి ఒక్కరు చట్టాన్ని గౌరవించాలని కోరారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.