బీహార్‌ శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ ఈ రోజు విడుదల కానుంది. ఈ మేరకు మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. కరోనా వ్యాప్తి తర్వాత దేశంలో జరుగుతున్న తొలి రాష్ట్ర స్థాయి ఎన్నికలు ఇవే. 243 మంది సభ్యులున్న బీహార్‌ అసెంబ్లీ ప్రస్తుతం గడువు నవంబర్‌ 29తోముగియనుంది. ప్రస్తుతం బీహార్‌లో జేడీయూ, బీజేపీతో క లిసిన ఎన్‌డీయే కూటమి అధికారంలో ఉంది. జేడీయూ అధినేత, సీఎం నితీశ్‌ కుమార్‌ ఈ సారి కూడా ఎన్‌డీఏ నుంచి సీఎం అభ్యర్థిగా బరిలో నిలవడం దాదాపు ఖాయమైనట్లే. ఇక బీజేపీ, జేడీయూతో తలపడేందుకు కాంగ్రెస్‌,ఆర్జేడీ సిద్ధమవుతున్నాయి.

కాగా, దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో సురక్షితంగా ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు సహా పలు వర్గాల నుంచి సలహాలు, సూచనలు కోరింది ఈసీ. వీలైనంత తక్కువ దశల్లోనే ఓటింగ్‌ చేపట్టేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort