బిగ్‌బాస్‌ నుంచి మోనాల్‌ను పంపించాల్సిందే.. బిగ్‌బాస్‌పై ప్రేక్షకుల ఆగ్రహం.!

By సుభాష్  Published on  24 Oct 2020 3:07 PM IST
బిగ్‌బాస్‌ నుంచి మోనాల్‌ను పంపించాల్సిందే.. బిగ్‌బాస్‌పై ప్రేక్షకుల ఆగ్రహం.!

బిగ్‌బాస్‌-4లో కంటెస్టెంట్లతో మాత్రమే కాదు.. ప్రేక్షకుల ఓట్లతో కూడా ఆటలాడుతున్నాడని ప్రేక్షకుల ఆరోపణ. అత్యధికంగా ఓట్లు వేస్తున్న కంటెస్టెంట్లను కాదని తమకు నచ్చిన వారిని ఎలిమినెట్‌ చేస్తున్నాడని చాలా మంది బిగ్‌బాస్‌పై మండిపడుతున్నారు. దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్‌, కుమార్‌ సాయిని కావాలని బయటకు పంపించేశారని ఇప్పటికే ఆగ్రహంతో మండిపడిపోతున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు ఏడో వారం ముగింపు వచ్చింది. మళ్లీ కంటెస్టెంట్‌ బిగ్‌బాస్‌ హౌస్‌ను వీడాల్సిన సమయం వచ్చింది. అయితే ఈసారైనా తక్కువ ఓట్లు వచ్చిన వారినే పంపిస్తారా..? లేక వారిని కాపాడుకునేందుకు నచ్చనివారిని పంపిస్తారా..? అనేది అనుమానాలు మొదలయ్యాయి.

ఇక ఈ వారం మోనాల్‌, అవినాష్‌, అరియానా, అభిజిత్‌, దివి, నోయల్‌ నామినేషన్‌లో ఉన్నారు. ఎప్పటిలాగే అభిజిత్‌కు ఎక్కువ ఓట్లు రావడంతో అతడు సేఫ్‌ అయ్యాడు. కానీ వైల్డ్‌ కార్డు ఎంట్రీ ఇచ్చిన అవినాష్‌కు అభిజిత్‌ కన్నా ఎక్కువ ఓట్లు రావడం విశేషం. అవినాష్‌ అందరితో కలిసిపోతూ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తున్నాడు. ఎవరితోనూ పెద్దగా గొడవలు, మనస్పర్థలు లేవు. హౌస్‌లో అందరితో కలుపుగోలుగా ఉంటూ వస్తున్నాడు. అయితే నోయల్‌కు ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉండటంతో ఎలిమినేషన్‌ నుంచి గట్టెక్కాడు. ఇక అరియానా ఆట తీరు రోజురోజుకు పెరిగిపోతోంది. అందరూ చప్పట్లు కొట్టినా.. మద్దతు ఇచ్చేవాళ్లే లేరు. అయినా తన టాటెంట్‌తో అభిమానులను గెలుచుకుంటూ ప్రతి వారం ఓట్లు వచ్చేలా ముందుకు సాగుతోంది.

ఇక మోనాల్‌ విషయానికొస్తే.. నిజానికి ఆమె గత వారమే వెళ్లిపోవాల్సి ఉన్నా తప్పించుకుని హౌస్‌లోనే ఉండిపోయింది. మోనాల్‌ను కాపాడి కుమార్‌ను బలి చేశారు. అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చినా సరే బిగ్‌బాస్‌ నిర్వాహకులే కావాలని ఆమెను కాపాడి అనవసరంగా కుమార్‌ సాయిని పంపించారని చాలా మంది బిగ్‌బాస్‌ను తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ సారి సాధారణ స్థాయిలో కూడా ఓట్లు రావడం లేదు. ఇప్పటి వరకు వచ్చిన ఓట్లలో సుమారు 70 శాతం వరకు మోనాల్‌ ఎలిమినేట్‌ కావాలని కోరుకుంటున్నారు.

బిగ్‌బాస్‌ షో పెరిగే కొద్ది ప్రేక్షకుల్లో వ్యతిరేకత చాలా పెరిగిపోతోంది. ఇలా ఒక కంటెస్టెంటుపై ఇంత వ్యతిరేకత రావడం ఈ సీజన్‌లో ఇదే తొలిసారి. అయితే తర్వాత స్థానంలో దివి ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య ఓటింగ్‌ శాతం తేడా 50 శాతనికి పైగా ఉంది. మోనాల్‌ను కాదని దివిని, లేదా ఆ తర్వాత స్థానాల్లో ఉన్న అరియానా, నోయల్‌ను ఎలిమినేట్‌ చేయడం బిగ్‌ బాస్‌ నిర్వాహకులకు కత్తిమీద సాము లాంటిది. మోనాల్‌ను కాకుండా ఏ ఒక్కరిని బయటకు పంపించినా.. బిగ్‌బాస్‌పై మరింత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఉన్న ఆప్షన్‌ ఒక్కటే. మోనాల్‌ను ఎలిమినేట్‌ చేయడం.. లేదా నో ఎలినిమనేషన్‌ ప్రకటించి తప్పించుకోవడం. మరి బిగ్‌బాస్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సిందే.

Next Story