కాజల్‌ ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ ఇదేనా..!

By సుభాష్  Published on  24 Oct 2020 5:45 AM GMT
కాజల్‌ ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ ఇదేనా..!

టాలీవుడ్‌ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌ మరో ఆరు రోజుల్లో శ్రీమతి కాబోతోంది. ముంబాయికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త, ఇంటీరియల్‌ డిజైనర్‌ గౌతమ్‌ కిచ్లును ఈ నెల 30న పెళ్లి చేసుకోబోతున్నారు. చాలా తక్కువ మంది అఅతిథులతో వీరి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో కాజల్‌ తన పెళ్లి గురించి పలు విశేషాలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకుంటోంది. ఈ క్రమంలో తన ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ను సైతం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. వివాహం మరో ఆరు రోజులే ఉండటంతో కాజల్‌, గౌతమ్‌ నివాసాల్లో పెళ్లి పనులు జోరందుకున్నాయి. దీంతో పెళ్లి కుమార్తె ఏడడుగులు వేసేందుకు సిద్దమవుతున్నారు.

కాగా, వరుడు గౌతమ్‌ సైతం దుస్తుల ఎంపిక గురించి తెలియజేస్తూ సోషల్‌ మీడియా వేదికగా తాజాగా ఓ పోస్టు పెట్టారు. వెడ్డింగ్‌ షాపింగ్‌ నా వివాహ దుస్తులను ఏ డిజైనర్స్‌ సిద్ధం చేస్తున్నారనుకుంటున్నారు..? అని ఆయన నెటిజన్లను అడిగారు. మరో వైపు వివాహం అనంతరం తాము నివసించబోయే ఇంటిని అలంకరించే పనిలో గౌతమ్‌ బిజీగా ఉన్నారని, ఏదైనా సలహాలు ఉంటే చెప్పమని ఇటీవల కాజల్‌ అభిమానులను కోరిన విషయం తెలిసిందే. అలాగే తన నిశ్చితార్థంకు సంబంధించిన రింగ్‌ను చూపించారు కాజల్‌, రింగ్‌ చూస్తుంటే డైమండ్‌ రింగ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈ ముద్దుగుమ్మ వివాహనం అక్టోబర్‌ 30న ముంబాయిలో జరగబోతోంది. జీవితంలోని ఈ కొత్త ఆరంభం కోసం మే ఎంతో థ్రిల్లింగ్‌గా ఎదురు చూసున్నాం. మీ అందరూ కూడా ఈ ఆనందంలో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నా.. ఇన్నేళ్లుగా మీరంతా నాపై కురిపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ ఇటీవల సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ కొత్త ప్రయాణంలో మేం మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను. పెళ్లి తర్వాత కూడా నేను నా నటనను కొనసాగిస్తాను. ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తాను అంటూ కాజల్‌ వెల్లడించింది.

View this post on Instagram

@kajalaggarwalofficial flaunts her engagement ring!!! ❤️ #kajalagarwal #wedding

A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis) on Oct 23, 2020 at 1:48am PDT

Next Story