కుదుటపడిన బిగ్ బీ ఆరోగ్యం !!
By సత్య ప్రియPublished on : 19 Oct 2019 11:24 AM IST

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం కుదుటపడింది. దీంతో ఆయన్ను శుక్రవారం రాత్రి ముంబైలోని నానావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
అభిషేక్ బచ్చన్, జయాబచ్చన్‌లు కారులో వచ్చి ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లారు. నాలుగు రోజుల క్రితం లివర్ సంబంధిత సమస్యలతో ఆయన నానావతి ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.
తొలుత ఆస్పత్రి చేరికపై స్పష్టత రాకున్నా.. పలు జాతీయ మీడియా కథనాలు ప్రచారం చేసింది. ఆ తర్వాత నానావతి ఆస్పత్రి వర్గాలు కూడా బిగ్ బీ వైద్య పరీక్షల కోసమే వచ్చినట్లు తెలిపాయి. ఆయన హెల్త్‌కు సంబంధించిన ఎలాంటి బులిటెన్ విడుదల చేయలేదు.
కాగా, బిగ్ బి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షూటింగ్ మంగళవారం నుంచి ప్రారంభమవుతుందని టీవీ వర్గాలు వెల్లడించాయి.
Next Story