బిగ్ బాస్3: బాబా భాస్కర్, వితికాల మధ్య పోటీ జరగనుందా??
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Oct 2019 9:21 AM GMTబిగ్‌బాస్ ఇచ్చిన ‘బ్యాటిల్ ఆఫ్ ద మెడాలియన్’ రెండో లెవల్‌లో శ్రీముఖి, శివజ్యోతి, బాబా భాస్కర్, అలీ రెజా తలపడ్డారు. ఈ టాస్క్‌లో ఒక్కొక్కరు ఒక్కో ఫ్రేమ్‌లో నిలబడి తలపై పెట్టుకున్న వస్తువును ఫ్రేమ్‌కు ఆనించాలి. ఫ్రేమ్, వస్తువును కాని చేతితో తాకడం లాంటివి చేయకూడదు. ఇక ఎక్కువ సేపు బ్యాలెన్స్‌గా ఉన్న బాబా భాస్కర్ ఈ టాస్క్‌లో గెలిచి ఫైనల్ లెవల్‌కు చేరుకున్నాడు. బుధవారం ఆడిన గేమ్ లో వితికా గెలవగా, గురువారం ఎపిసోడ్‌లో బాబా గెలిచాడు.
'బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్' ఆఖరి అంకానికి వెళ్లే ముందు ఇంటిస భ్యుల అభిప్రాయాలు చెప్పమని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఫైనల్ లెవల్‌కు చేరుకున్న బాబా భాస్కర్, వితికలలో నచ్చి నవారికి తిలకం పెట్టి... నచ్చని వ్యక్తి తలమీద గుడ్డు పగలగొట్టాలని పేర్కొన్నాడు.
శ్రీముఖి, శివజ్యోతి, మహేశ్ లు వితికపై గుడ్డు పగలకొట్టి, బాబాకు తిలకం పెట్టారు. అలీరెజా, రాహుల్, వరుణ్, పునర్నవి బాబా భాస్కర్ మీద గుడ్లు పగలగొట్టి వితికకు నుదుటిపై బొట్టు పెట్టారు. ఇక బాబా భాస్కర్, వితికలలో మెడల్ ఎవరి సొంతం అవుతుందో చూడాలి!