బిగ్ బాస్ 3 - ఎలిమినేట్ అయిన రవి కృష్ణ..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Sep 2019 7:37 AM GMTహిమజ తరువాత నటుడు రవికృష్ణ ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. వరుణ్ సందేశ్, శ్రీముఖి, బాబా భాస్కర్ నామినేట్ అవ్వగా, రవి బయటికి వచ్చేశాడు. హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ ఇంటి సభ్యులందరి చేతా రచ్చ రచ్చ చేయించారు. వారితో అసక్తికరమైన టాస్క్‌లు చేయించాడు. అలీ-వితికాలు జంటగా నటించి అందరిని ఆకట్టుకున్నారు. మహేశ్, శివజ్యోతి న్యూస్ రిపోర్టింగ్ చేశారు. రాహుల్, పునర్నవి అద్భుతంగా పారడీ పాటలు పాడారు.
రవి ఎలిమినేషన్‌పై జ్యోతి, అలీ చాలా బాధ పడ్డారు. బాధపడుతున్న బాబా భాస్కర్ ను రవి ఓదార్చాడు.
నాగార్జున బిగ్ బాస్‌లో తన ప్రయాణం గురించి వీడియో ప్రదర్శించినప్పుడు రవి కన్నీరు పెట్టుకున్నారు. చివరగా, రవి ఇచ్చిన రేటింగ్ ప్రకారం బిగ్ బాస్ ఇంటిలోవారికి తీపి ,చేదు లడ్డూలు తినాల్సి వచ్చింది. వెళ్తూ వెళ్తూ రవి పునర్నవి పై బాబు పేల్చాడు. బిగ్ బాస్ మళ్లీ ఆదేశించేదాకా అందరి బట్టలూ తనే ఉతకాలని చెప్పాడు. మొత్తానికి ఎంతో ఆసక్తికరంగా ఎలిమినేషన్ ఎపిసోడ్ సాగింది