బిగ్‌బాస్‌ హౌస్ సభ్యుల పైన కోపంగా ఉన్న'సల్లూ భాయ్'

 Published on  29 Dec 2019 11:56 AM GMT
బిగ్‌బాస్‌ హౌస్ సభ్యుల పైన కోపంగా ఉన్నసల్లూ భాయ్

బిగ్‌బాస్‌ షో కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్ హౌస్ లోకి వెళ్లి ఇంటిని శుభ్రం చేశాడు. హౌస్ లో ఉండే సభ్యులు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవట్లేదని స్వయంగా సల్మాన్ రంగంలోకి దిగాడు. ఆయన ఇంటోకి వచ్చే సమయానికి అందరు సభ్యులు బెడ్ రూమ్ లో ఉండగా తలుపులు మూసుకున్నాయి. అనంతరం వంటగదిలోకి వెళ్లి సభ్యులు తిని వదిలేసిన గిన్నెలను శుభ్రం చేశారు.

హౌస్ మేట్స్ కు లోపల ఏం జరుగుతుందో కొద్దిసేపటివరకు అర్ధం కాలేదు. అదేవిధంగా గ్యాస్ స్టవ్ పైన పేరుకుపోయిన జిడ్డును.. వంట గదిని శుభ్రం చేశాడు. తరువాత బాత్రూం ను కూడా క్లిన్ చేశాడు ఇదంతా చూస్తున్న సభ్యులు సిగ్గుతో తలదించుకున్నారు. తరువాత సభ్యులు సల్మాన్ కు సారీ చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఆయన కోపంగానే ఉన్నట్టు తెలుస్తుంది. వీటికి సంబందించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

Next Story
Share it