బిగ్ బాస్ -3 పునర్నవి ఆగ్రహం..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Sep 2019 8:24 AM GMTబిగ్ బాస్ తెలుగు 3 లో పునర్నవి భూపాలం బలమైన ప్రత్యర్ధిగా ముందుకు దూకుతోంది. పునర్నవి తన విశేషమైన వ్యక్తిత్వాన్ని సంరక్షించుకుంటూ వస్తోంది.
బిగ్‌బాస్‌పై పునర్నవి భూపాలం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ''మీ గేమ్ మీరే ఆడుకోండి" అని కోపంతో విరుచుకుపడింది. అంతకుముందు బిగ్ బాస్ హౌస్‌లోని గార్డెన్ ఏరియాలో పునర్నవి కూర్చుంది. వెనక నుంచి బాబా భాస్కర్, శిల్ప, వితిక, హిమజ వచ్చి ఆమెను అమాంతం ఎత్తుకెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో పడేస్తారు. అనంతరం పూల్ నుంచి బయటకు వచ్చిన పునర్నవి.. హౌజ్‌మేట్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అది ఒకవేళ టాస్క్ అయినప్పటికీ.. అలా మ్యాన్‌హ్యాండ్లింగ్ చేయడమేంటని మండిపడింది. బిగ్‌బాస్ ఇవేం టాస్కులు అంటూ మండిపడటమే కాకుండా.. మీ గేమ్‌ని మీరే ఆడుకోమని.. టాస్క్ నుంచి వాక్ అవుట్ చేసింది. అగ్రహంతో టాస్క్ సరిగా చేయని కారణంగా బిగ్ బాస్ ఆమెను శిక్షించాలని నిర్ణయించాడు. ఆ శిక్షను కూడా ఆమె అంగీకరించలేదు
శిక్షకు అంగీకరించని హౌస్ మేట్స్ ఎలిమినేషన్ కు నామినేట్ అవుతారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే తన నిర్ణయం మార్చుకోనని పునర్నవి చెప్పేసింది. మరి ఇక ఏమి జరుగుతుందో వేచి చూడాలి.