వాళ్లిద్దరూ శ్రీముఖీ స్నేహితులు..!- హిమజ హాట్ కామెంట్స్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Sep 2019 11:51 AM GMTబిగ్ బాస్ హౌజ్ అంటేనే క్లోజ్ వరల్డ్. బయట ప్రపంచంతో వారికి ఏ సంబంధాలు ఉండవు. ఉన్నన్ని రోజులు వారితో వారు మాట్లాడుకుంటూ..పోట్లాడుకుంటూ ఉంటారు. ప్రేక్షకులకు తెలిసేది చాలా తక్కువ. బిగ్ బాస్ నిర్వహకులకే చాలా ఎక్కువుగా తెలుస్తుంది. మనకు చూపించే వాటిని టీఆర్‌పీ దృష్టిలో పెట్టుకుని ఎడిట్ చేస్తారు. మనకు చూపించే వాటిలో గొడవలు , అల్లరి ఉంటాయి. కారణాలు మాత్రం స్పష్టంగా ఉండవు. కొట్టుకుంటారు..తిట్టుకుంటారు..మళ్లీ కలిసిపోతారు. ఎవరు గెలవాలి..ఎవరు ఓడాలి అనేది నిర్వహకులు చేతిలో ఉంటుందా?. హిమజ కామెంట్స్ చూస్తే అలానే అనిపిస్తుంది.
బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు రాగానే హిమజ శ్రీముఖిపై బాంబ్ పేల్చింది. శ్రీముఖికి అభిషేక్, శ్యామ్ అనే ఇద్దరు బిగ్ బాస్ డైరక్టర్లు స్నేహితులుగా ఉన్నట్లు వీడియో రిలీజ్ చేసింది. ఈ విషయం శ్రీముఖినే తనకు స్వయంగా చెప్పినట్లు వెల్లడించింది.
శ్రీముఖి తరచుగా కెమెరాలు దగ్గరకు వెళ్లి సలహాలు, సూచనలు ఇచ్చేదని తెలిపింది. ఈ టాస్క్ బాగోలేదని..మరొకటి ఇవ్వమని ఇలా అడిగేదని హిమజ చెప్పింది. అందుకే.. శ్రీముఖికి అనుకూలంగా షో కట్ చేస్తున్నారనే కామెంట్లు కూడా వస్తున్నాయి.
ఖాళీగా కూర్చున్న ఆమెకు సంబంధించిన ఫుటేజ్ ప్లే చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. ఈ విషయాలను శ్రీముఖి అభిమానులు ఖండిస్తున్నప్పటీకి..బిగ్ బాస్ డైరక్టర్స్ శ్రీముఖి స్నేహితులా అనేది సామాజిక మాద్యమాల్లో దుమ్ములేపుతుంది.