రాహుల్ తో రిలేషన్ షిప్ పై పునర్నవి క్లారిటీ ..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Sep 2019 10:04 AM GMTహైదరాబాద్ : నామినేషన్ లూ, గొడవలతో మొదలైన బిగ్ బాస్ తొమ్మిదో వారంలో బుధవారం సరదాగా గడిచిపోయింది. ఇంటి సభ్యులకు ఇచ్చిన క్రేజీ కాలేజీ టాస్క్‌లో భాగంగా పాఠాలు చెప్పిన టీచర్లు వరుణ్, వితిక, బాబా భాస్కర్‌లు విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. చిల్లాలజీ లెక్చరర్ వరుణ్ పెట్టిన పరీక్షలో స్టూడెంట్స్ మహేశ్, శివజ్యోతి, హిమజలు 5 స్టార్స్ తెచ్చుకోగా... శ్రీముఖి, రాహుల్‌లు మాత్రం 4 స్టార్లతో వెనకబడిపోయారు.
లవ్వాలజీ పరీక్షలో భాగంగా స్టూడెంట్స్ లవ్ ప్రపోజల్ చేయాల్సి ఉండగా బాబా భాస్కర్, వితికలు జడ్జిలుగా వ్యవహరించారు. మహేశ్- శివజ్యోతి, రవి-శ్రీముఖి, మహేశ్- పునర్నవి, రాహుల్-హిమజలు జంటలుగా నటించారు. హిమజ- మహేశ్‌లను పిలిచి గత నామినేషన్ ప్రక్రియలో కావాలనే మహేశ్‌ను సేవ్ చేయలేదా అని హిమజను ప్రశ్నించగా.. పొరపాటుగా అలా జరిగిందే తప్ప కావాలని చేయలేదని చెప్పింది. అందరూ పరవాలేదనిపించినా ఉన్న దాంట్లో రాహుల్-హిమజ జంట బాగా చేయడంతో వారిని విజేతలుగా ప్రకటించారు.
ఇక గాసిపాలజీ టీచర్ వితిక నిర్వహించిన పరీక్షలో శివజ్యోతి టీచర్‌పైనే గాసిప్ సృష్టించగా, ఇద్దరి మధ్య ఎలా గొడవ పెట్టవచ్చు అనే ప్రశ్నకు శ్రీముఖి చెప్పిన సమాధానం ఆ టీచర్‌నే ఆశ్చర్యపరచింది. నువ్వు విన్న బిగ్గెస్ట్ గాసిప్ చెప్పమని పునర్నవిని అడగ్గా, మహేశ్-బాబా భాస్కర్‌ల మధ్య పెరుగుతున్న దూరం అంటూ సమాధానం చెప్పింది.
తరువాత...టీచర్ వితిక గాసిప్ గురించి మాట్లాడుతూ పునర్నవి ని నువ్వు రాహుల్ ఫ్రెండ్సా? లవర్సా? అని నిలదీసింది. దీనికి పునర్నవి తామిద్దరం లవర్స్ కాదని కుండబద్దలు కొట్టి చెప్పింది. అయితే, ఫ్రెండ్స్ కూడా కాదని చెప్పింది. కాంప్లికేటెడ్ ఫ్రెండ్స్ అంటూ వివరణ ఇచ్చింది.