చిన్నారికి పాలు అందివ్వడానికి ఆయన చేసిన ప్రయత్నం

By సుభాష్  Published on  4 Jun 2020 10:28 AM GMT
చిన్నారికి పాలు అందివ్వడానికి ఆయన చేసిన ప్రయత్నం

మన సమాజంలో చెడు ఎన్ని రూపాల్లో ఉంటుందో మంచి కూడా అంత కంటే ఎక్కవ రూపాల్లో ఉంటుంది అని చెప్పడానికి ఈ సంఘటనే సాక్ష్యం. ఇప్పటికే వలస కూలీలు పడుతున్న కష్టాలను చూస్తూనే ఉన్నాం. వారికి కొందరు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు సహాయం చేస్తున్నారు.

భోపాల్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఆగింది. అక్కడ ఉన్న రైల్వే అధికారి యాదవ్ ను.. వలస కార్మికురాలైన షఫీయా హష్మీ అనే మహిళ పాలు తీసుకుని రమ్మని సాయం అడిగింది. ఆ అధికారి పాలు తీసుకురావడానికి వెళ్ళాడు. ఇంతలోనే రైలు కదిలింది. ఇది గమనించిన యాదవ్ ఒక్క ఉదుటున పరుగు మొదలు పెట్టి ఆ తల్లికి పాలు అందచేసాడు. ఈ వీడియో ను ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఒకతను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు యాదవ్ చేసిన మంచి పనికి అభినందనలు తెలిపారు.

ఇదే వీడియో ను ఆ చిన్నారి తల్లి షఫీయా కూడా పోస్ట్ చేసి 'తన పాపకు బిస్కెట్ లు తినిపించాను. కానీ పాల కోసం ఏడ్చాడు. తన దగ్గర పాలు అందుబాటులో లేవు. అక్కడ ఉన్న అధికారిని అడగ్గానే వెంటనే తెచ్చి ఇచ్చారు' అని పోస్ట్ చేసింది. నెటిజెన్స్ యాదవ్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు. లలిత అనే మహిళ యాదవ్ జీ చాలా మంచి పని చేసారు. కేంద్ర రైల్వే మంత్రి ని ఉద్దేశించి.. గోయల్ జీ ఇలాంటి ఉద్యోగులను గుర్తు పెట్టుకొని మరీ అభినందించాలి. అపుడే మిగతా వారు కూడా ఇలాంటి మంచి పనుల్లో భాగస్వాములు అవుతారు. అని కామెంట్ చేసింది.

'ఆయన ఒక ప్రాణాన్ని కాపాడాడు అతను చాలా మందికి ఆదర్శమని, ఇలాంటి వారిని చూసి చాలా నేర్చుకోవాలి అని కామెంట్ చేసాడు' అని మనోజ్ సక్సేనా కామెంట్లు పెట్టాడు. పలువురు ఆయనకు మంచి ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ రైల్వే శాఖకు ట్వీట్లు చేస్తూ ఉన్నారు.

Next Story
Share it