పోలవరం ప్రాజెక్ట్‌కు భూమి పూజ..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Nov 2019 11:48 AM ISTప.గో.జిల్లా: స్పిల్ వే బ్లాక్ నంబర్ 18 వద్ద మేఘా ఇంజనీరింగ్ సంస్థ డిజిఎం ఎ. వెంకట సతీష్, మేనేజర్ పమ్మీ మురళి, జలవనరుల శాఖ ఈఈ ఏసుబాబు సమక్షంలో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ ఈఈలు శేఖర్ బాబు, మళ్లీఖార్జున్, సుధాకర్బాబు, పాండురంగయ్య, డిఈలు రామేశ్వర్ నాయుడు , బాలకృష్ణ, లక్ష్మణ్, ఏసు దాసు, యశోధరావు, శ్రీనివాస్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
�
రివర్స్ టెండరింగ్‌తో రూ.628 కోట్లు ఆదా..!
మేఘా ఇంజనీరింగ్ గతంలో పనులు చేపట్టిన సంస్థల కంటే తక్కువ శాతంకు కోడ్ చేసింది. -12.6% తక్కువ కోడ్ చేసింది.
రివర్స్ టెండరింగ్‌తో ఏపీ ప్రభుత్వానికి రూ.628 కోట్లు ఆదా అయ్యాయి.జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4, 987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలిచింది. రూ. 4358 మొత్తానికి టెండర్ దాఖలు చేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ.
పోలవరం ప్రాజెక్ట్ వల్ల లాభాలు
పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే 7.2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తారు. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 80 టీఎంసీల గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజ్ ఎగువన కృష్ణా నదికి తరలిస్తారు. 23.44 టీఎంసీల నీటిని విశాఖపట్నానికి తాగునీటి అవసరాల నిమిత్తం తరలిస్తారు. పోలవరం కాలువకు అనుకుని ఉన్న 540 గ్రామాల్లోని 28.5 లక్షల మంది ప్రజల కు త్రాగునీరు కూడా అందిస్తారు. ఏక కాలం లో రిజర్వాయర్ పనులు, జల విద్యుత్ కేంద్రం పనులు పూర్తి చేయనుంది మేఘా ఇంజినీరింగ్ సంస్థ.
రెండేళ్లలో పోలవరాన్ని పూర్తి చేస్తాం: మంత్రి అనిల్
పోలవరం పనులు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయని మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్‌ను అనుకున్న సమయంలో పూర్తి చేస్తామన్నారు. పోలవరంతోపాటు అన్ని ప్రాజెక్ట్‌లను నిర్దేశిత సమయంలో పూర్తి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల పునరావాసం పనులు నిర్లక్ష్యం చేసిందని..అందుకే పనులు లేట్ అయ్యాయన్నారు. అన్ని ప్రాజెక్టుల పనులు, పునరావాసం నియమిత సమయంలో పూర్తి చేస్తామన్నారు మంత్రి అనిల్. అబద్దాలు, మోసం చేసి ప్రజలను మభ్యపెట్టే అలవాటు తమకు లేదన్నారు. ప్రతిపక్షoతో పాటు మరో రెండు పార్టీలు ఎదో హడావుడి చేస్తున్నాయన్నారు. సీఎం నిర్ణయంతో రివర్స్ టెండర్ ద్వారా రూ. 800 కోట్లు ఆదాచేశామన్నారు. 2021 జూన్ లోపు పోలవరం పూర్తి చేయగలమని అధికారులు అంచనా వేశారని చెప్పారు.