విరాట్ కాదు.. నా దృష్టిలో ధోనినే..

By Newsmeter.Network  Published on  4 Feb 2020 12:53 PM GMT
విరాట్ కాదు.. నా దృష్టిలో ధోనినే..

హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని పై ప్రశంసల జల్లు కురిపించాడు. భారత్‌ చూసిన అత్యుత్తమ కెప్టెన్లలో ధోని ఒకడని.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూల్ గా ఉండడం ధోనికే చెల్లుతుందన్నారు. టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు.. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌తో పాటు 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ అందించి కెప్టెన్‌ గా రికార్డు సృష్టించాడని, నిస్సేందేహంగా భార‌త కెప్టెన్ల అంద‌రిలోనూ ధోనీనే అత్యుత్త‌మమ‌ని రోహిత్ వ్యాఖ్యానించాడు. ప్రశాంతంగా ఉంటే మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చునన్నాడు.

చాలా యువ ఆటగాళ్లుకు ధోని అవ‌కాశాలిచ్చాడ‌ని గుర్తు చేశాడు. యువ ఆటగాళ్లు ఒత్తిడికి గురైతే వారి వద్ద కెళ్లి ఏం చేయాలో చెప్పి వాళ్లలో ధైర్యాన్ని నింపుతాడన్నాడు. ఒక సీనియర్‌ ఆటగాడు జూనియర్‌ ఆటగాడితో.. అలా కలిసిపోతే వారికి ఉపశమనం పొంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారని పేర్కొన్నాడు. అలాగే ఐపీఎల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు నిలకడగా ప్రదర్శించడానికి ప్రధాన కారణం ధోనీ కెప్టెన్సీయే అని తెలిపాడు. ఇక ధోని కెప్టెన్సీలోనే రోహిత్ అరగ్రేటం చేసిన సంగతి తెలిసిందే.

కాగా.. కాలి పిక్క‌గాయంతో రోహిత్ న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న నుంచి త‌ప్పుకున్నాడు. ఇక వ‌న్డే వ‌రల్డ్‌క‌ప్ ముగిశాక ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు విరామం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితా నుంచి ధోనిని తొలగించడంతో.. ధోని రిటైర్‌మెంట్ పై వార్తలు వినిపించాయి. అయితే ఇంత వరకు ధోని వాటి పై స్పందించలేదు. ఐపీఎల్ 2020 సీజన్‌ లో ధోని బరిలోకి దిగే అవకాశం ఉంది.

Next Story
Share it