'ది సన్‌'కు బెన్‌ 'స్ట్రోక్స్‌'

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Sep 2019 3:19 PM GMT
ది సన్‌కు బెన్‌ స్ట్రోక్స్‌

ముంబై: ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్‌కు కోపమొచ్చింది. తమ కుటుంబం గురించి బాధ్యతారాహిత్యంగా ప్రచురించిన 'ది సన్‌' దినపత్రికపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్టోక్స్‌ న్యూజిలాండ్ సంతతివాడు. ఈ విషయం క్రికెట్ అభిమానులకు తెలియంది కాదు.న్యూజిలాండ్‌లో పుట్టినప్పటికీ ఇంగ్లండ్ తరపున క్రికెట్ ఆడుతూ కీలక ఆటగాడిగా మారాడు. ఇంగ్లండ్ దశాబ్దాల ప్రపంచ కప్‌ కలను నిజం చేశాడు స్టోక్స్.

తన తల్లి మాజీ భర్త మూర్ఖత్వం కారణంగా యాషెస్ హీరో స్టోక్స్ సోదరుడు, సోదరి హత్యకు గురయ్యారు. స్టోక్స్‌ పుట్టకకు మూడేళ్లు ముందు ఈ హత్యలు జరిగాయని 'ది సన్‌' ప్రచురించింది. స్టోక్స్‌ కుటుంబ వ్యక్తి గత విషయాలు కూడా ముద్రించారు. తమ విలేకరని న్యూజిలాండ్ పంపి ఈ కథనం రాయించారు. "ఇవేనా జర్నలిజం విలువలు అంటూ" స్టోక్స్ సోషల్ మీడియాలో ఆవేదన భరితంగా పోస్ట్ చేశాడు. ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో స్టోక్స్ రెండు సెంచరీలు చేసి 441 పరుగులు, 8 వికెట్లతో మ్యాన్‌ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్న సంగతి క్రికెట్ అభిమానులకు తెలిసిందే.

Next Story
Share it