కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్రస్తుతం ప్రపంచాన్ని వణిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 3వేలకు పైగా మృత్యువాత పడ్డారు. ఇదిలా ఉంటే కరోనా వైరస్‌ ఇద్దరు క్రికెటర్ల మధ్య చిచ్చు పెట్టింది. ఓ క్రికెరట్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు మరో క్రికెటర్‌కి ఆగ్రహాం తెప్పించింది. ఆ ఇద్దరు క్రికెటర్లు మరెవరో కాదు.. ప్రపంచకప్‌ హీరో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ కాగా.. మరోకరు ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ మిచెల్‌ జాన్సన్‌.

మరికొన్ని రోజుల్లో ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఇంగ్లాండ్‌.. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. మార్చి 19 నుంచి ఈ సిరీస్‌ ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే.. ఈ పర్యనలో శ్రీలంక ఆటగాళ్లతో కరచాలనం చేయమని, అందుకు బదులుగా ఫిస్ట్‌ బంప్‌(పిడికిలి బిగించి మెల్లిగా చేతులు గుద్దుకోవడం) చేస్తామని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా పలువురు ఇంగ్లాండ్‌ క్రికెటర్లతో పాటు ఆ జట్టు సహాయసిబ్బంది అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ విభృంభిస్తున్న నేపధ్యంలో ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు సైతం తమ ఆటగాళ్లు వ్యక్తిగత శుభ్రత పాటించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే సూచించింది.

కాగా ఆసీస్‌ ఆటగాడు మిచెల్‌ జాన్సన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేశాడు. 2017లో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ ఒక క్లబ్‌ దగ్గర గొడవపడిన సందర్భాన్ని పోలుస్తూ పోస్టు చేశాడు. అప్పుడు ఈ ఆల్‌రౌండర్‌ ఇద్దరి పై దాడి చేసి అరెస్టయ్యాడు. ఇంగ్లాండ్‌ మీరు ఫిస్ట్ బంప్‌ చేయండి, కానీ స్టోక్స్‌తో జాగ్రత్తగా ఉండడండి, అతడు గట్టిగా పంచ్‌లు విసురుతాడేమో అంటూ బాక్సింగ్‌ ఎమోజీతో పాటు నవ్వుతున్న ఎమోజీని జత చేశాడు. ఇది చూసిన బెన్‌స్టోక్స్‌కి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ఘాటుగా బదులిచ్చాడు. బార్మీ ఆర్మీ(ఇంగ్లాండ్‌ టీమ్‌ను అభిమానించే బృందం) 2010-11 యాషెస్‌ సిరీస్‌ సందర్భంగా జాన్సన్‌ను ఉద్దేశించి ఈ బృందం ఓ పాట పాడి అతన్ని ఇబ్బంది పెట్టింది. బౌల్స్‌ టు ద లెఫ్ట్‌, బౌల్స్‌ టు ద రైట్‌, ఐ వండర్‌ ఇఫ్‌ బిగ్‌ బ్యాడ్‌ మిచ్‌ లైక్స్‌ మార్‌మైట్‌ అనే పాట లిరిక్స్‌ను స్టోక్స్‌ ట్వీట్‌ చేశాడు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.