బెజవాడ కనకదుర్గమ్మ దర్శన వేళల్లో మార్పులు
By సుభాష్
బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శన వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా విస్తరణ కారణంగా ఇప్పటివరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే అమ్మవారి దర్శనాలు కొనసాగుతున్నాయి. అయితే, ప్రస్తుతం కరోనా పరిస్థితిలో మార్పు లేనప్పటికీ కరోనా నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ ఆలయంలో దర్శనాల ఉంటాయని తెలిపారు. ఆలయం వేళలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు పొడిగించాలని అధికారులు నిర్ణయించారు.
బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శన వేళల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కరోనా కారణంగా ఇప్పటి వరకు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమ్మవారి దర్శనాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో మార్పు లేనప్పటికీ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయం వేళలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పొడిగించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. దీతో శుక్రవారం నుంచి అమ్మవారు భక్తులకు రోజు 14 గంటల చొప్పున దర్శనం కల్పించనున్నారు.
ఇక కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి అమ్మవారి సేవల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశాన్ని సైతం నిలిపివేశారు అధికారులు. ఈ రోజు నుంచి భక్తులకు ప్రతి రోజు ఉదయం 6 గంటలకు జరగనున్న అమ్మవారి పంచహారతుల సేవలో పరిమితి సంఖ్యలో భక్తులు పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. అమ్మవారి సేవల టికెట్లు ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంచారు. మీ సేవా సెంటర్ల ద్వారా కూడా భక్తులు అమ్మవారి సేవ టికెట్లను పొందవచ్చని ఆలయ అధికారులు పేర్కొన్నారు.