చల్లగా రోజు పెగ్గు బీరు తాగండంటున్న 'పెటా'
By అంజి Published on 12 Feb 2020 11:19 AM GMTచల్ల చల్లగా ఓ బీరు లాగిస్తే ఆ కిక్కు వేరేలా ఉంటుంది. బీరు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, అనర్థాలు జరుగుతాయని వైద్యులు చెబుతుంటూరు. అయితే వైద్యుల సూచనలకు భిన్నంగా ఓ సంస్థ బీరు ప్రియులకు మద్దతిస్తోంది. రోజుకో ఓ పెగ్గు బీరు తాగమని సలహా ఇస్తోంది. రోజు ఒక పెగ్గు బీరు తాగడం వల్ల.. అది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని ప్రముఖ జంతు సంరక్షణ సంస్థ (PETA) 'పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్' చెబుతోంది.
గ్లాస్ పాలు తాగే బదులు పెగ్గు బీరు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆ సంస్థ అంటోంది. ఉదయం లేవగానే ఓ గ్లాసు పాలు తాగమని పిల్లలకు, పెద్దలకు వైద్యులు సూచిస్తుంటారు. ఈ మేరకు పేటా సంస్థ ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. హ్వార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనల ఆధారంగా పెటా ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఇండియా టూడే అనే న్యూస్ వెబ్‌సైట్ పేర్కొంది. బీరు తాగే విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని పెటా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ట్రేసీ రీమాన్స్ తెలిపారు. మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే.. బీరే మంచిదని ఆయన పేర్కొన్నారు.
పాల డెయిరీ ఉత్పత్తుల వల్ల ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్‌తో పాటు, ఆరోగ్య సమస్యలు వస్తాయని పెటా సంస్థ చెప్పింది. డెయిరీ ఉత్పత్తుల వల్ల డయాబెటిస్, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, ఒబెసిటీ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించింది. పాల ఉత్పుత్తులను తీసుకోవడం వల్ల ఎముకల వ్యాధి సోకుతుందని, దీనిరి సంబంధించి కొన్ని రుజువులు కూడా వెల్లడి అయ్యాయని పెటా చెప్పినట్లు ఇండియా టుడే తన కథనంలో రాసింది. బీరు తాగడం వల్ల ఎముకలు గట్టిగా తయారవుతాయి. పెటా సంస్థ చెప్పిందని రోజు పెగ్గు బీరు తాగడం కాకుండా వీలున్నప్పుడల్లా మితంగా తాగడం ఆరోగ్యానికి మేలు.
మీకు తెలుసా..
బీరు తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు లేకుండా చేస్తుంది.
బీరులో నీటి కంటే మెరుగైన హైడ్రేట్లు ఉంటాయి.
బీరు తాగడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది.
ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 400 రకాల బీర్లు ఉన్నాయి.
ఇది నిజం.. బీర్, ఐస్‌క్రీమ్ కలిసి తింటే చాలా రుచిగా ఉంటుంది.
తక్కువ మోతాదులో బీరు తీసుకుంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.