ఆ న‌లుగురికి ఈ రోజు ప్ర‌త్యేక‌మైంది.. అందుకే బీసీసీఐ వారికి..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Dec 2019 5:45 PM IST
ఆ న‌లుగురికి ఈ రోజు ప్ర‌త్యేక‌మైంది.. అందుకే బీసీసీఐ వారికి..

భార‌త క్రికెట్‌ జట్టులోని ఆ నలుగురు ఆటగాళ్లకు ఈరోజు చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. ఆ నలుగురు భార‌త జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించి విజ‌యాల‌లో పాలుపంచుకున్న‌వారే. వారందికి ఒకేరోజు ఎందుకు ప్ర‌త్యేక‌మ‌నుకుంటున్నారా..? వారంద‌రూ బ‌కే రోజు పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు.

వివ‌రాళ్లోకెళితే.. టీమిండియా పేస్ బౌల‌ర్‌ జస్ప్రీత్‌ బుమ్రా, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, యువ బ్యాట్స్‌మెన్ శ్రేయస్‌ అయ్యర్‌, కరుణ్‌ నాయర్‌ బర్త్‌డేలు చేసుకుంటున్నారు. ఇలా భార‌త‌ జట్టులోని నలుగురు ఆటగాళ్లు ఒకేరోజు బర్త్‌డేలు జరుపుకోవడం విశేషం.



ఈ న‌లుగురు ఆట‌గాళ్ల‌ బర్త్‌డే ను పుర‌స్క‌రించుకుని బీసీసీఐ ట్విట్టర్ వేదికగా వీరంద‌రికి బర్త్‌డే విషెష్ తెలిపింది. మైదానంలో ఆ నలుగురు చేసిన సంబరాల వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది. బీసీసీఐ ట్వీట్‌లో 'బర్త్‌డే బాయ్స్‌ నలుగురికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే జడేజా, బుమ్రా, శ్రేయస్, కరుణ్‌' అని ట్వీట్ చేసింది.

ఇదిలావుంటే ఈ రోజు రాత్రి వెస్టిండీస్‌తో జరిగే తొలి టీ20లో బర్త్‌డే బాయ్స్‌ శ్రేయస్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజాలు బ‌రిలోకి దిగుతున్నారు. వీరిద్దరికి తుది జట్టులో చోటుదక్కే అవకాశం ఉండ‌గా.బుమ్రా వెన్ను గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఇక నాయర్‌.. సెహ్వాగ్‌ తర్వాత ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. నాయర్ చివరిసారిగా టీమిండియా త‌ర‌పున 2017 మార్చి ధర్మశాలలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ ఆడాడు.

Next Story