ముఖ్యాంశాలు

  • ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా రెండో టెస్ట్
  • ఇండియాలో తొలి డే అండ్‌ నైట్‌ టెస్టు
  • హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు

బంగ్లాతో కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు సంబంధించి తొలి మూడు రోజుల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సంతోషం వ్య‌క్తం చేశాడు. అలాగే టీమిండియా సార‌థి కోహ్లిని కొనియాడాడు. ఇది ఇండియాలో జ‌రుగుతున్న తొలి డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్ కావ‌డం విశేషం.

దీంతో గంగూలీ.. 'గ్రేట్‌ విరాట్‌ కోహ్లి రాకతో ఈడెన్‌ గార్డెన్‌ గ్యాలరీలు హౌస్‌ఫుల్‌ అవుతాయి. దీన్ని చూసి కోహ్లి సంతోషిస్తాడు. టెస్టు క్రికెట్‌కు అభిమానుల్ని తీసుకురావడం అంత తేలిక కాదు. ఇది డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌ కావడంతో ప్రేక్షక్షులు ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో కూడా ఇలానే కొనసాగాలి. ఈడెన్‌లో ఏర్పాట్లు మైమరిపిస్తాయి. అభిమానులతో ఈడెన్‌ కిక్కిరిసిపోతుందని గంగూలీ ఆశాభావం వ్య‌క్తం చేశాడు.

సామ్రాట్

Next Story