మహిళల ఐపీఎల్‌.. తేదీలు విడుదల చేసిన బీసీసీఐ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Oct 2020 10:27 AM GMT
మహిళల ఐపీఎల్‌.. తేదీలు విడుదల చేసిన బీసీసీఐ

కరోనా కారణంగా వాయిదా పడిన పురుషుల ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా పురుషుల ఐపీఎల్‌ ముగిసే సమయంలోనే మహిళల ఐపీఎల్‌ నిర్వహిస్తూ వస్తోంది బీసీసీఐ. పురుషుల టోర్నీ నవంబర్‌ 10న ముగుస్తుండగా.. మహిళల ఐపీఎల్ నవంబర్‌ 1 నుంచి 10 వరకు జరగనుందని ఐపీఎల్ పాలక మండలి గతంలో తెలిపింది.

తాజాగా ఏఏ తేదీల్లో మ్యాచులు జరుగుతాయో బీసీసీఐ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గత సీజన్ లో ఈ లీగ్ లో కేవలం 3 జట్లు మాత్రమే పాల్గొన్నాయి. కానీ ఈ ఏడాది మాత్రం 4 జట్లతో ఈ లీగ్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలి చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా 3 జట్లతోనే బీసీసీఐ మినీ ఐపీఎల్ నిర్వహిస్తుంది. ఈ మూడు జట్లకు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధనా, మిథాలీ రాజ్ న్యాయకత్వం వహించనున్నారు.ఇక పురుషుల ఐపీఎల్ కు ఏ విధమైన కరోనా నియమాలు వర్తిస్తాయో మహిళల ఐపీఎల్ కు కూడా అవే నియమాలు వర్తిస్తాయి.

సూపర్‌ నోవాస్‌ జట్టుకు హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్‌ కాగా.. ట్రైల్బ్లేజర్స్ జట్టుకు స్మృతి మంధాన, వెలోసిటీ జట్టుకు మిథాలీ రాజ్‌ నాయకత్వం వహిస్తున్నారు.

Next Story