నేడు, రేపు బ్యాంకులు బంద్

By రాణి  Published on  31 Jan 2020 5:24 AM GMT
నేడు, రేపు బ్యాంకులు బంద్

ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలు నేడు, రేపు నిలిచిపోనున్నాయి. వేతన సవరణ డిమాండ్ చేస్తూ..నేడు, రేపు అన్ని ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు సమ్మెకు సిద్ధమయ్యారని, ఈ నేపథ్యంలోనే బ్యాంకుల సేవలను రెండ్రోజులపాటు నిలిపివేస్తున్నట్లు యూఎఫ్ బీయూ (యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్) ప్రకటించింది.

అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు 20 శాతం వేతనాలను పెంచాలని, 5 రోజుల పనిదినాలు, ఎన్ పీఎస్ తొలగింపు వంటి 11 డిమాండ్లతో కార్మికశాఖ కేంద్రంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని యూఎఫ్ బీయూ ప్రకటనలో పేర్కొంది. కేంద్రంతో చర్చలు విఫలమైనందుకే సమ్మెకు సిద్ధమైనట్లు తెలిపింది. కాగా...బ్యాంకు ఉద్యోగుల వేతనాలు పెంచాలని ఇప్పటి వరకూ 20 సార్లు చర్చలు జరిపినా ఫలితం దక్కలేదు. 13 శాతానికి మించి బ్యాంకు ఉద్యోగుల వేతనాలు పెంచేందుకు కేంద్రం అంగీకరించడం లేదని యూఎఫ్ బీయూ ప్రకటనలో వెల్లడించింది.

శుక్ర, శనివారాలు జరిగే సమ్మెలో సమ్మెలో సమ్మెలో ఏఐబీఈఏ, ఏఐబీఓసీ, ఎన్‌సీబీఈ, ఏఐబీఓఏ, బీఈఎఫ్‌ఐ, ఐఎన్‌బీఈఎఫ్, ఐఎన్‌బీఓసీ, ఎన్‌ఓబీడబ్ల్యూ, ఎన్‌ఓబీఓ బ్యాంకింగ్ సంఘాలు, ఉద్యోగులు పాల్గొననున్నారు. రెండ్రోజుల సమ్మెతో ప్రభుత్వం నుంచి తమ డిమాండ్లకు అనుకూలమైన స్పందన రాకపోతే..మార్చి 11,12,13 తేదీల్లో కూడా సమ్మె చేయనున్నట్లు యూఎఫ్ బీయూ కేంద్రాన్ని హెచ్చరించింది. బ్యాంకుల సమ్మె వల్ల వివిధ వ్యాపారాలకు నష్టం వాటిల్లనుంది. అలాగే నిత్యం లావాదేవీలతో జరిగే చిన్న, పెద్ద వ్యాపారాలు కూడా నష్టాలు చూడాల్సి వస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవల కోసం సోమవారం వరకూ ఎదురుచూడాల్సిందే.

Next Story