బ్యాంకుల విలీనంపై బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఈ రోజు దేశ వ్యాప్తంగా ఒక్కరోజు బ్యాంక్‌ల సమ్మె చేపట్టారు. సమ్మెలో భాగంగా ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలోని పలు బ్యాంక్‌ ఉద్యోగుల సమాఖ్యలు బంద్‌లో పాల్గొన్నాయి. విలీనం పేరుతో ఉద్యోగ భద్రత ఉండదని..భవిష్యత్‌లో బ్యాంకింగ్‌ వ్యవస్థకు ప్రమాదమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 బ్యాంక్‌లు 4 బ్యాంకులుగా విలీనం చేస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12 కు తగ్గుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా తగ్గించటం..విలీనాలతో బ్యాంకులు ప్రవేటీకరణకు దారితీస్తుంది. దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. బ్యాంకుల విలీనంతో ఉద్యోగులు తగ్గిపోతారు. దీంతో నిరుద్యోగ సమస్య పెరిగి పోతుంది. ప్రభుత్వం వెంటనే పునారాలోచించాలని బ్యాంక్‌ ఉద్యోగులు కోరుతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.