కడప: చెక్‌బౌన్స్‌ కేసులో సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌కు ఊరట లభించింది. కడప మొబైల్‌ కోర్టు బండ్ల గణేష్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. గణేష్‌పై ప్రొద్దుటూరులో, కడపలో రెండు చెక్‌ బౌన్స్‌ కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో బాధితులతో బండ్ల గణేష్‌ తరఫు న్యాయవాది రాజీ ప్రయత్నం కుదిర్చాడు. బాకీ సొమ్ములో 4 లక్షల రూపాయాలను చెల్లించాడు. మిగతా మొత్తాన్ని వచ్చే నెల 14వ తేదీన చెల్లించేలా బండ్ల గణేష్‌ ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందం కుదరడంతో గణేష్‌ న్యాయవాది బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. బెయిల్‌ పిటిషన్‌ను పరిశీలించిన మెజస్ట్రేట్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.