పారిశుధ్య పనుల్లో పందికొక్కులు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2019 6:25 AM GMT
పారిశుధ్య పనుల్లో పందికొక్కులు..!

ముఖ్యాంశాలు

  • కేటీఆర్ ప్రారంభించనున్న రోబోటిక్
  • మ్యాన్‌హోల్స్‌లో సిల్ట్‌ తీయడం ఇక సులభం

హైదరాబాద్‌: మ్యాన్‌హోల్స్‌ కార్మికుల పాలిట డెత్ హోల్స్‌గా మారకూడదనే సదుద్దేశంతో హైదరాబాద్‌లో పారిశుధ్య పనుల్లో సాంకేతికతను వినియోగించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోబోటిక్ బండికావుట్ ను గచ్చిబౌలిలోని బిమోదైవర్సిటీ సెంటర్లో మంగళవారం ప్రారంభించనున్నారు. ఐటీ కారిడార్‌లో పారిశుధ్య పనులు చేపట్టేందుకు మనుషులతో పనిలేకుండా కృత్రిమంగా తయారు చేసిన పందికొక్కును నగరంలో మొదటిసారిగా మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టనున్నారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన సిల్ట్ తొలగించేందుకు ఈ పరికరాలు ఎంతగానో ఉపయోగపడుతాయి.

ఈ బృహత్తర కార్యక్రమానికి సుమారు రూ.32లక్షల నిధులను సీఎస్‌ఆర్ సంస్థ సమకూరుస్తున్నట్లు జీహెచ్ఎంసీ ప్రధాన అధికారులు తెలిపారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ఈ యంత్రాలను ఉపయోగిస్తామన్నారు. వీటిని తేలికపాటి కార్బన్ ఫైబర్‌తో తయారుచేసిన... ఈ మర యంత్రంలో కెమెరాలతో పాటు అధునాతన సాంకేతికతను పొందుపరిచారు. దీంతో ప్రధానంగా నాలుగు ప్రయోజనాలు ఉన్నాయి.

ఈ రోబోటిక్‌ పందికొక్కును స్మార్ట్ టెక్నాలజీ ద్వారా సులభంగా, త్వరితగతిన మ్యాన్‌హోల్స్‌లోని సిల్ట్ ను తొలగించొచ్చు. మ్యాన్‌హోల్స్‌ నుండి వెలువడే ప్రాణాంతక మీథెన్, హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ మొనాక్సయిడ్ వంటి విష వాయువులను ముందుగానే పసిగట్టడం జరుగుతుంది. దీంతో మ్యాన్‌హోల్స్‌లో పారిశుధ్య పనులు చేసే కార్మికులు మృత్యువాత పడకుండా జాగ్రత్తలు తీసుకోడం సులభం.

Next Story