గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు అస్వస్థత

By అంజి
Published on : 9 March 2020 11:56 AM IST

గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు అస్వస్థత

ముఖ్యాంశాలు

  • గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు ఛాతిలో నొప్పి
  • హైదర్‌గూడ అపొలో ఆస్పత్రికి తరలింపు
  • దత్తాత్రేయకు వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్లు

హైదరాబాద్‌: హిమచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అస్వస్థత గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు హుటా హుటిన హైదర్‌గూడ అపొలో ఆస్పత్రికి తరలించారు. దత్తాత్రేయ డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం దత్తాత్రేయ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిసింది. కాగా గత కొంతకాలంగా దత్తాత్రేయ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని సమాచారం. దత్తాత్రేయ వయస్సు 73 సంవత్సరాలు.

గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో జాయింట్‌ మెనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీత తెలిపారు. ఆయన రోటిన్‌ చెకప్‌ కోసమే హాస్పిటల్‌కు వచ్చారని, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ శ్రీనివాస్‌ చెక్‌ చేశారని అన్నారు. సాయంత్రం గవర్నర్‌ సిమ్లాకు బయల్దేరుతారని చెప్పారు.

2019 సెప్టెంబర్ 1న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయను కేంద్ర ప్రభుత్వం నియమించింది. 2019 సెప్టెంబర్ 11న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర 27వ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేశారు.

Also Read: దటీజ్‌ హరీష్‌రావ్‌!.. ఏం చేశాడంటే?

గతంలో కూడా 2015 సంవత్సరంలో వరంగల్‌లో బీజేపీ తరఫున లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన ముక్కు నుంచి రక్తం కారడంతో.. అప్పుడు మ్యాక్స్‌కేర్‌ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయన కోలుకున్నారు.

Next Story