కరోనాతో పోరాడుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వెల్లడించింది. ఈ మేరకు ఈ రోజు బాలు ఆరోగ్యంపై ఆస్పత్రి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనురాధ భాస్కరన్‌ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. బాలు స్పృహలోకి వచ్చారని, వైద్య చికిత్సకు స్పందిస్తున్నారని బులిటెన్‌లో పేర్కొన్నారు. వెంటిలెటర్‌, ఎక్మో సాయంతో ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ఆయన ఆరోగ్యంపై వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని తెలిపారు.

ఆయనకు ఫ్లాస్మా థెరపీ కూడా చేశారు. కాగా.. మొదట ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నా.. మధ్యలో కాస్త విషమించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ నెల మొదటి వారంలో బాలసుబ్రహ్మణ్యం కరోనాతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆస్పత్రి నుంచి కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని అభిమానులు, సినీ ప్రముఖులు, ప్రజలు ఎన్నో ప్రార్థనలు చేస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.