త్రివిక్ర‌మ్‌కు బాల‌య్య గ్రీన్ సిగ్న‌ల్ - సైలెంట్ సునామీ షురూ గురూ..!

By Newsmeter.Network  Published on  2 Feb 2020 4:55 AM GMT
త్రివిక్ర‌మ్‌కు బాల‌య్య గ్రీన్ సిగ్న‌ల్ - సైలెంట్ సునామీ షురూ గురూ..!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న మాటల్లో ఏదో తెలియ‌ని గమ్మ‌త్తు ఉంటుంది. ఆయ‌న రాసే ప్ర‌తి ప‌దం మ‌న‌స్సును హ‌త్తుకుంటుంది. ఇప్పుడు వ‌స్తున్న కొత్త ర‌చ‌యిత‌ల‌కు ఆయ‌నో ఆద‌ర్శం ఆన‌డంలో సందేహం లేదు. ఆయ‌న‌తో సినిమా చేయాల‌ని అంద‌రు పెద్ద హీరోలు సైతం ఆశ‌ప‌డుతుంటారు. ప్ర‌స్తుతం వ‌రుస హిట్‌లు అందుకుంటూ అగ్ర ద‌ర్శ‌కుల జాబితాలో టాప్ రేంజ్‌లో ఉన్నాడు త్రివిక్ర‌మ్‌.

రీసెంట్‌గా అలా వైకుంఠ‌పురం మూవీతో హిట్‌కొట్టిన త్రివిక్ర‌మ్ త‌న నెక్ట్స్ సినిమా ప్లాన్‌లో ఉన్నాడ‌ని తెలుస్తుంది. ఆ సినిమా గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన అప్డేట్ ఒక‌టి ఫిల్మ్ న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. త్రివిక్ర‌మ్ నెక్ట్స్ ఎన్టీఆర్‌తో సినిమా చేయ‌బోతున్నాడ‌ని టాక్. ఆ సినిమాలో బాల‌కృష్ణ న‌టిస్తార‌ని తెలుస్తుంది. బాల‌య్య‌, ఎన్టీఆర్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూపించాల‌ని ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ అనుకుంటున్నార‌ని దానికి త‌గ్గ‌ట్టుగానే పూర్తి క‌థ‌ను సిద్ధం చేసుకుంటున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో ఓ వార్త చక్క‌ర్లు కొడుతోంది.

తెలుగులో మ‌ల్టీస్టార‌ర్స్ సినిమాల‌కు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఒకే ఫ్రేమ్‌లో ఇద్ద‌రు హీరోలు క‌నిపించ‌డం అంటే అభిమానుల‌కు పండ‌గనే చెప్పాలి. అందులోను ఒకే కుటుంబానికి చెందిన ఇద్ద‌రు హీరోలు ఒకే సినిమాలో క‌నిపిస్తే ఇక ఆ ఊహ‌కు అవ‌ధులు ఉండ‌వ‌నే చెప్పాలి. నంద‌మూరి అభిమానులు కూడా ఇలాంటి సంద‌ర్భం కోస‌మే వెయిట్ చేస్తున్నారు. మ‌రోప‌క్క త్రివిక్ర‌మ్ క‌థ విన్న బాల‌య్య కూడా ఎన్టీఆర్‌తో క‌లిసి న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌న్న ప్రచార‌మూ జ‌రుగుతోంది.

ఇందుకు సంబంధించిన మ‌రిన్ని అప్డేట్ తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాను హారిక హాసిని క్రియేష‌న్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ క‌లిసి నిర్మిస్తున్నాయి. ప్ర‌స్తుతం త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్‌లో ఉన్న ఆ త‌రువాత ఈ సినిమాకు షిఫ్ట్ కానున్నాడు. మిగ‌తా న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌ల గురించి తెలియాల్సి ఉంది. మొన్న‌టి వ‌ర‌కు బాల‌య్య‌ సినిమా అంటే ద‌బిడి దిబిడే అంటూ హంగామా చేసిన అభిమానులు త్రివిక్ర‌మ్ అన‌గానే సైలెంట్ సునామీ షురూ గురూ అంటూ కామెంట్లు వినిపిస్తున్నారు.

Next Story
Share it