రీల్ హీరో.. రియల్ హీరో అయ్యాడు..!
By Medi Samrat Published on 12 Nov 2019 4:39 PM ISTనందమూరి బాలకృష్ణ.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తనయుడిగా.. తెలుగు సినిమా అభిమానులను ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అలరించిన నటుడిగా మనందరికి సురపరిచితుడు. అంతేకాకుండా బాలయ్య రాజకీయాల్లో కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతపురం జిల్లా హిందుపురం ఎమ్మెల్యేగా కూడా రాణిస్తున్నారు. ఇలా బాలయ్య గురించి చాలానే చెప్పోచ్చు.
నిత్యం.. పైన వెల్లడించిన విషయాలలో ఎదో ఒక విషయమై వార్తల్లో బాలయ్య పేరు ఎప్పుడూ నానుతూనే ఉంటుంది. అయితే ఈరోజు మాత్రం మరో విధంగా వార్తల్లో నిలిచారు బాలయ్య. అనంతపురం నగరంలో క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారికి ఉచితవైద్యం అందింపజేశారు. అలాగే ఈ రోజు ప్రత్యేకంగా వెళ్లి ఆ అమ్మాయితో ఆప్యాయంగా మాట్లాడి.. తనలో ధైర్యం నింపారు బాలయ్య. ఇది తెలిసిన బాలయ్య అభిమానులు రియల్ హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇలాంటివి జరిగితేనే కదా రీల్ హీరోలు సైతం రియల్ హీరోలు అయ్యేది.