టర్కీ దళాల అదుపులో ఇస్లామిక్‌ స్టేట్‌ చీఫ్‌ బాగ్దాదీ సోదరి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2019 5:24 AM GMT
టర్కీ దళాల అదుపులో ఇస్లామిక్‌ స్టేట్‌ చీఫ్‌ బాగ్దాదీ సోదరి

అమెరికాలో సేనల చేతిలో హతమైన ఇస్లామిక్‌ స్టేట్‌ చీఫ్‌ అల్ బాగ్దాదీ సోదరుడిని టర్కీ దళాలు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బగ్దాదీ సోదరి రస్మియా కుటుంబానికి కూడా.. ఉగ్రవాద కార్యకలాపాలుతో సంబంధం ఉందని అధికారులు భావిస్తున్నారు. స్థానిక అజాజ్ అనే పట్టణంలో నివసిస్తున్న ఈ కుటుంబాన్ని పోలీసులు ఈ మేరకు అదుపులోకి తీసుకున్నారు. వీరిని టర్కీదళాలు ఇంటరాగేట్ చేస్తున్నట్లుగా సమాచారం. ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో అలెప్పా ప్రాంతాన్ని టర్కీ దళాలు తమ అదుపులోకి తీసుకుని జల్లెడ పడుతున్నాయి.

కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ అధినాయకుడు, ఉగ్రవాది అల్ బాగ్దాదీని అమెరికా మట్టు పెట్టిన విషయం తెలిసిందే. ముందు ట్విట్టర్ ద్వారా విషయాన్ని సూక్ష్మంగా చెప్పిన ట్రంప్ తర్వాత మీడియా సమావేశంలో పూర్తి వివరాలను అందించారు. అల్‌ఖైదా అధిపతి ఒసామా బిన్‌ లాడెన్‌ను తుదముట్టించిన తరహాలోనే అమెరికా సైనిక కమాండోలు సాగించిన ప్రత్యేక ఆపరేషన్‌లో బాగ్దాదీ మట్టిలో కలిచాడు. దాడి మొత్తాన్ని వైట్‌హౌస్‌లో ట్రంప్‌, ఇతర అధికారులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇదంతా సినిమా చూస్తున్నట్లే ఉందని ట్రంప్‌ చెప్పారు. ఆపరేషన్‌ అనంతరం ఆయన బాగ్దాదీ హీరోలా చనిపోలేదు. పిరికివాడిలా ఏడుస్తూ, అరుస్తూ, మూలుగుతూ, తన పిల్లలను కూడా వెంట తీసుకెళ్తూ.. కుక్క చావు చచ్చాడన్నారు. అల్‌ బాగ్దాదీ చేతిలో దారుణ అత్యాచారానికి, చిత్రహింసలకు, చివరికి హత్యకు గురైన అమెరికా మానవతా కార్యకర్త 'ఖైలా ముల్లర్' పేరును ఈ ఆపరేషన్‌కు పెట్టారు.

Next Story