బాగ్దాది 'కుక్క' చావు..? 'కైలా ముల్లేర్' ఆత్మ శాంతించేనా?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Oct 2019 7:09 PM ISTకుక్క చావు చావడం అంటే ఇదేనేమో.. కలుగులో కుక్కలు తరుముతుండగా ఎటు వెళ్లాలో తెలియక ఐసిస్ చీఫ్ బాగ్దాదీ చిక్కుకుపోయాడు. బాగ్దాదిని లొంగిపొమ్మని అమెరికా హెచ్చరికలు చేసింది. అయితే.. అప్పటికే బాగ్దాది ఉన్న భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో బాగ్దాదీతో పాటు మరో ముగ్గురు చిన్నారులు ప్రాణాలను విడిచారు. బాగ్దాది చనిపోవడంతో కైలా ముల్లెర్‌కు న్యాయం జరిగిందని అమెరికా పేర్కొంది. బాగ్దాదిని చంపేందుకు 'ఆపరేషన్ కైలా ముల్లెర్' పేరిటా అమెరికా వేట ప్రారంభించింది. అసలు కైలా ముల్లెర్‌కు, బాగ్దాదికి సంబంధమెంటో తెలియాలంటే కింద స్టోరీ చదవాల్సిందే.
సిరియా, ఇరాక్ దేశాల్లో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో బాగ్దాది ఐసిస్ ను స్థాపించాడు, ఇస్లామిక్ రాజ్యం పేరుతో మారణహోమం సృష్టించాడు. ఐసిస్ చేసిన నరమేధంలో లక్షల మంది అశువులు బాశారు. ఐసిస్ చర్యలప్థె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ సిరియాలోని ఉగ్రస్థావరాలప్తె దాడులకు ఆదేశించారు. దీనికి 'కైలా ముల్లెర్' అని అమెరికా నామకరణం చేసింది. అసలు విషయం ఏమిటంటే కైలా ముల్లెర్ అమెరికా వాసి. ఆమె సమాజంలో సేవా కార్యక్రమాలు చేసే సంస్థలో పని చేస్తుండేది. ఈ నేపథ్యంలో 2013లో ఓ ఆస్పత్రిలో విధులు నిర్వహించేందుకు టర్కీ నుంచి అలెప్పోకు ప్రయాణిస్తుండగా కైలా ముల్లెర్‌ను ఐసిస్ కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత ఆమెను బాగ్దాది అత్యంత దారుణంగా అత్యచారానికి ఒడిగట్టి హతమార్చాడు. 2015లో ఐసిస్ చెరలో కైలా ముల్లెర్ మరణించిన విషయాన్ని అమెరికా ధ్రువీకరించింది. ఐసిస్ మాత్రం వైమానిక దాడిలో మరణించిందని అంతర్జాతీయ సమాజానికి చెప్పకొచ్చింది
బాగ్దాదిని ఆదివారం తెల్లవారు జామున అమెరికా సేనలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో గత ఐదు నెలలుగా సీఐఏ డ్రోన్స్, శాటిలైట్స్‌తో ఆ ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు కదిలిన అమెరికా -ఇరాక్- టర్కీస్- రష్యా సేనలు బాగ్దాది ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీంతో..ప్రత్యర్ధులకు చిక్కడం ఇష్టంలేక బగ్దాది తన పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడని అమెరికా ప్రకటించింది. ఈ సందర్భంగా అబు బాకర్‌ను అంతమొందించడంలో తమకు సహకరించిన సిరియా కుర్దిష్ వర్గాలు, రష్యా, టర్కీ మిత్రదేశాలకు ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు.