బాగ్దాదిని పట్టించింది ఎవరు? ఐసిస్ అధినేత ఎలా చనిపోయాడు..?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Oct 2019 8:56 AM GMT
బాగ్దాదిని పట్టించింది ఎవరు? ఐసిస్ అధినేత ఎలా చనిపోయాడు..?!

బాగ్దాద్‌ : సిరియా, ఇరాక్‌ల్లో మారణహోమం సృష్టించి బాగ్దాది చనిపోయాడు. అయితే..బాగ్దాది సమాచారం అమెరికా అధికారులకు ఇచ్చింది బాగ్దాది అనుచరుడే అంటున్నారు. ఈ విషయాన్ని ఇరాక్ భద్రాతాధికారులు కూడా ధృవీకరించారు. బాగ్దాదిని ఆదివారం తెల్లవారు జామున అమెరికా సేనలు చుట్టుముట్టాయి. దీంతో బాగ్దాది తన పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడని అమెరికా ప్రకటించింది.

‘ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా పురుడుపోసుకున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థ వేలాది మంది ప్రాణాలను తీసింది. కానీ.. దాని స్థాపకుడు బాగ్దాది చివరికి ఒక పిరికివాడిలా తనను తాను అంతం చేసుకున్నాడు’ అని ట్రంప్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా అబు బాకర్‌ను అంతమొందించడంలో తమకు సహకరించిన సిరియా కుర్దిష్‌ వర్గాలు, రష్యా, టర్కీ మిత్రదేశాలకు ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఇరాక్‌ భద్రతా అధికారులు కీలక ప్రకటన చేశారు. ఈ ఆపరేషన్‌లో అబు బాకర్‌ ప్రధాన అనుచరుడు ఇస్మాయిల్‌ అల్‌-ఇతావీ ఇచ్చిన సమాచారం ఎంతగానో ఉపయోగపడిందన్నారు.

Image result for BAGHDADI HUNT

కూరగాయల బస్సుల్లో వెళ్లేవాడు..!

అబు బాకర్‌ జాడ కోసం అన్వేషిస్తున్న క్రమంలో టర్కీస్ అధికారులకు బాగ్దాది అనుచరుడు ఇతావీ దొరికాడు. 2018లో ఇతావీ టర్కీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ తరువాత ఇరాక్ ఆర్మీకి అప్పగించారు. ఇతావీని విచారించిన అధికారులు బాగ్దాది సమాచారం రాబట్టారు . ఇతావీ చెప్పిన దాని ప్రకారం..

"అబు బాకర్‌ ఎప్పుడూ మినీ బస్సుల్లోనే తన సహచరులతో సమావేశం అవుతాడు. కూరగాయలతో నిండిన ఆ బస్సుల్లో వారంతా దొంగచాటుగా గమ్యస్థానాలకు చేరుకుంటారు. ఇస్లామిక్‌ సైన్సెస్‌లో పీహెచ్‌డీ చేసిన ఇతావీ అబు బాకర్‌ ఐదుగురు ముఖ్య అనుచరుల్లో ఒకడు. అతడు 2006లో ఉగ్ర సంస్థ ఆల్‌ ఖైదాలో చేరాడు. 2008లో అమెరికా సేనలకు పట్టుబడటంతో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఈ క్రమంలో ఇతావీ గురించి తెలుసుకున్న అబు బాకర్‌ తమతో చేతులు కలపాల్సిందిగా అతడిని కోరాడు. ఈ క్రమంలో మత పరమైన సూచనలు ఇవ్వడంతో పాటు ఇస్లామిక్‌ స్టేట్‌ కమాండర్లను ఎంపిక చేయడంలోనూ ఇతావీ కీలక పాత్ర పోషించేవాడు."

కుటుంబం, అనుచరులే రక్షణ కవచం

ఇతావీ బాగ్దాదీ గురించి రహస్యాలన్నీ ఇరాక్‌ అధికారులకు చెప్పాడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు సిరియాలోని ఇడ్లిబ్‌ అనే ప్రాంతంలో అబు బాకర్‌ తల దాచుకున్నాడని అధికారులకు తెలిసింది. అయితే ఇడ్లిబ్‌పై పట్టు కలిగి ఉన్న, ఐఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసే మరో ఉగ్రసంస్థ నుస్రా ఫ్రంట్ అబు బాకర్‌ను చంపేందుకు వెంటపడ్డారు. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులు, ముగ్గురు అనుచరులను ఎల్లప్పుడూ వెంటబెట్టుకునేవాడని ఇతావీ తెలిపాడు. అదే విధంగా అతడు ఏయే సమయాల్లో ఏ చోట తల దాచుకుంటాడనే విషయాన్ని ఇరాక్‌ ఆర్మీకి చెప్పాడు. దీంతో అమెరికా భద్రతా సంస్థ సెంట్రల్‌ ఇంటలెజిన్స్‌ ఏజెన్సీతో సమన్వయం చేసుకున్నారు ఇరాక్ అధికారులు. ఇడ్లిబ్‌ సమీప ప్రాంతాల్లో ఎక్కువ సైన్యాలను మోహరించాలని ప్రణాళికలు రచించారు . ఈ క్రమంలో గత ఐదు నెలలుగా సీఐఏ డ్రోన్స్‌, శాటిలైట్స్‌తో ఆ ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. పక్కా ప్లాన్‌ ప్రకారం ముందుకు కదిలిన అమెరికా -ఇరాక్‌ -టర్కీస్‌ - రష్యా సేనలు బాగ్దాది ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీంతో..ప్రత్యర్ధులకు చిక్కడం ఇష్టంలేక బగ్దాది ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు.

bagdadi-sucide-follower-information

bagdadi-sucide-follower-informationNext Story