భగత్ సింగ్, ఆ పేరు వినగానే ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. భరత మాత కోసం, దేశ స్వాతంత్య్రం కోసం మరణాన్ని నవ్వుతూ ఆహ్వానించాడు. నేడు ఆయన జయంతి.

ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ లోని ఖత్కర్ కలాన్ అనే గ్రామంలో సెప్టంబర్ 28,1907న జన్మించాడు. అతని తల్లిదండ్రులు కిషన్ సింగ్, విద్యావతి. పదమూడేళ్ల ప్రాయంలో మహాత్మా గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం భగత్ సింగ్ పై ఎంతో ప్రభావం చూపింది. అప్పుడు అతను మొదటిసారి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. ప్రభుత్వ పుస్తకాలనూ, దుస్తులనూ తగలబెట్టాడు. అహింసా మార్గం మాత్రమే కాకుండా హింసాత్మక ఉద్యమంతోనే బ్రిటీషువారిని తరిమికొట్టగలం అనే ఉద్దేశ్యంతో ఉండేవాడు.

1919లో జలియన్ వాలా బాగ్ ఉదంతం అతనిని కలచివేసింది. యుక్త వయసు వచ్చాక పెళ్లి చేయడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నించగా “నా జీవితం దేశానికే అంకితం, నా వధువు స్వాతంత్య్రమే” అంటూ ఉత్తరం రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా, దేశంలో సైమన్ గో బ్యాక్ అంటూ ఉద్యమం నడుస్తున్న రోజుల్లో, లాహోర్ లో సూపరింటీండెంట్ సాండర్స్ లాఠీకి ఎదురు వెళ్లిన లాలా లాజపత్ రాయి పై విరుచుకుపడ్డాడు. దీనితో ఆయనకి గాయమై మరణించారు.

ఇది చూసి తట్టుకోలేని భగత్ సింగ్, సిఖ్ దేవ్, రాజ్ గురూ కసితీరా సాండర్స్ ను కాల్చి చంపారు. 1929లో అసెంబ్లీ పై బాంబులు వేసి ధైర్యంగా లొంగిపోయారు.

బ్రిటీష్ ప్రభుత్వం వీరు ముగ్గిరికీ ఉరి శిక్ష విధించింది. 23 ఏళ్ల ప్రాయంలో, మార్చి 23, 1931 రాత్రి 7.30ని లకు భగత్ సింగ్… సిఖ్ దేవ్, రాజ్ గురూ తో కలిసి నవ్వుతూ ఉరికంబం ఎక్కారు. వీరి మరణం ఎంతోమంది యువతను స్వాతంత్య్ర సమరం వైపుకి నడిపించింది. ఈనాటి యువతకు కూడా ఎంతో ఆదర్శవంతుడు భగత్ సింగ్.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.