సినిమాల్లోకి సైనా నెహ్వాల్‌..!

By అంజి  Published on  10 Feb 2020 8:56 AM GMT
సినిమాల్లోకి సైనా నెహ్వాల్‌..!

ఇటీవ‌ల కాలంలో వ‌రుస షాక్‌లు ఇస్తూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్. మొన్న‌టికి మొన్న ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఏకంగా త‌న స‌హ క్రీడా కారుడు పారుప‌ల్లి క‌శ్య‌ప్‌ని పెళ్లాడిన ఈ క్రీడా కారిణి తాజాగా మెడ‌లో కాషాయ రంగు కండువా క‌ప్పుకుని బీజేపీ స‌భ్య‌త్వం తీసేసుకుంది. ఇలా ఓ వైపు క్రీడ‌ల్లో రాణిస్తూనే రాజ‌కీయాల్లో కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌ని చూస్తున్న ఈ స్టార్ బ్యాడ్మింట‌న్ ఇప్పుడు మ‌రో కొత్త అవ‌తారం ఎత్తింది.

అస‌లే స‌డెన్ షాక్‌లు ఇవ్వ‌డంలో ఆరి తేరిన సైనా స‌రికొత్త అవ‌తారంలో అంద‌ర్నీ మ‌రోసారి షాక్‌కు గురి చేసింది. ఒక క్రీడా కారిణిగా నిత్యం త‌న ఆట‌పై దృష్టిని సారించే సైనా ఎప్పుడూ త‌న గ్లామ‌ర్ గురించి ఆలోచించింది లేదు. ఆఖ‌ర‌కు టీవీ యాడ్‌లో సైతం మోకాళ్ల నొప్పి మందునో.. మెడ నొప్పి మందునో, ప‌లాన ఆహారం తింటే విట‌మిన్లు పెరుగుతాయ‌నో చెప్పుకొచ్చిందే త‌ప్ప ప‌లాన ప్రొడక్ట్స్ వాడితే అందంగా క‌న‌ప‌డ‌తారు అంటూ ఎప్పుడూ చెప్పింది లేదు. ఆఖ‌ర‌కు కామన్ మ్యాన్ మాదిరి డ్ర‌స్ స్టైల్ ఫాలో అవుతూ వ‌చ్చింది.

మ‌రి, మారుతున్న కాలంతోపాటు తాను మారాలన్న ఆలోచ‌న వ‌చ్చిందో.. లేక తాను ఓ సెల‌బ్రిటీ అన్న విష‌యం గుర్తొచ్చిందో తెలీదు కానీ త‌న‌లోని గ్లామ‌ర్ యాంగిల్‌ను ఒక్క‌సారిగా బ‌య‌ట‌పెట్టేసింది. అయినా మ‌న సైనా ఏం చేసిందో తెలుసా..? స్టార్ హీరోయిన్ల‌ను మైమ‌రిపించేలా దుస్తులు ద‌రించి ఫోటోల‌కు ఫోజులిచ్చింది. అయితే, త‌న‌ను సంప్ర‌దించిన వోగ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ కోసం సైనా ఈ హాట్ హాట్ ఫోటోల ప్ర‌ద‌ర్శ‌న చేసిన‌ట్టు తెలుస్తుంది.

తాజాగా, సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న సైనా ఫోటోల‌ను చూసిన కుర్ర‌కారు ఈమె సైనా నెహ్వాలా...? లేక‌ స్టార్ హీరోయినా..? అంటూ కామెంట్ బాక్స్‌ల‌ను అక్ష‌రాల‌తో నింపేస్తున్నారు. కొంప‌దీసి సైనా ఏమ‌న్నా సినిమాల్లో ట్రై చేస్తుంద‌న్న అనుమానాల‌ను సైతం వారు వ్య‌క్తం చేయ‌డం విశేషం. ఏదేమైనా ఓ వైపు పాలిటిక్స్‌, మ‌రో వైపు స్ట్పోర్స్‌, ఇంకో వైపు ఫోటో షూట్స్ ఇలా అన్ని రంగాల్లో రాణించేందుకు సైనా చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను అభినందిద్దాం. ఇదిలా ఉండ‌గా,‘సైనా’ టైటిల్‌తో బాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో పరిణీతి చోప్రా టైటిల్‌ రోల్ పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Next Story