ముఖ్యాంశాలు

    li>ఏకగ్రీవంగా అయోధ్య తీర్పు ఇస్తున్న సుప్రీం కోర్ట్

  • పురావస్తు శాఖ ఆధారాలు పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్ట్
  • అలహాబాద్ హైకోర్ట్ తీర్పును తప్పుబట్టిన సుప్రీం కోర్ట్
  • సున్నీ బోర్డ్ కు ఐదు ఎకరాలు కేటాయించాలన్న సుప్రీం కోర్ట్/li>
  • వివాదాస్థలం అయోధ్య ట్రస్ట్ కు కేటాయించిన సుప్రీం కోర్ట్/li>
  • 3 నెలల్లో వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్ట్ కు ఇవ్వాలని సుప్రీం ఆదేశం/li>
  • 1045 పేజీల తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్ట్/li>
  • 134 సంవత్సరాల వివాదానికి సుప్రీం కోర్ట్ తెర దించింది/li>

రాముడు అయోధ్యలోనే జన్మించాడు..దీనిలో ఎటువంటి వివాదంలేదు అని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. షియా వక్ఫ్ బోర్డ్ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం కోర్ట్. తమకు మత విశ్వాసాలతో సంబంధంలేదని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. గతంలో ఉన్న నిర్మాణం ముస్లింలది కాదు అని ప్రకటించింది. పురావస్తు నివేదికను సుప్రీం కోర్ట్ సమర్ధించింది. బాబర్ దగ్గర పని చేసిన సైనికాధికారులు మసీదు నిర్మించినట్లు సమాచారం. 1883కు ముందు కూడా హిందూవులు పూజలు చేసుకునే హక్కును ఎవరూ అడ్డుకోలేదు. వివాదాస్థలంపై హక్కులు తేల్చాల్సింది రికార్డ్ లే.మసీదు నిర్మాణం ఖాళీ స్థలంలో జరగలేదు.బాబర్ కాలంలోనే నిర్మాణం జరిగింది.బాబ్రీ కూల్చివేత రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్ట్ ప్రకటించింది. బాబ్రీ మసీదు కింద మరో ఆలయం ఆనవాళ్లు ఉన్నాయని స్పష్టం చేసింతి. అక్కడ నమాజు చేసుకునే హక్కు ముస్లింలకు ఉందని సుప్రీం అభిప్రాయపడింది. వివాదాస్థలం తమదేనని ముస్లిం సంస్థలు నిరూపించుకోలేకపోయాయి.
అదే సమయంలో నిర్మొహి అఖాడా పిటిషన్ ను కూడా సుప్రీం కోర్ట్ కొట్టేసింది. గతంలో అలహాబాద్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్ట్ తప్పుబట్టిందిమసీదు నిర్మాణం కోసం వేరే స్థలాన్ని కేటాయించాలని సుప్రీం కోర్ట్ అభిప్రాయపడింది. ఐదు ఎకరాలు సున్నీ వక్ఫ్ బోర్డ్ కు కేటాయించాలి. 2.27 ఎకరాలు అయోధ్య ట్రస్ట్ కు అప్పగించాలి. వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రసక్తేలేదని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది.

అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దాదాపు 40 రోజుల పాటు విచారణ చేసిన న్యాయస్థానం కేసుపై …..ఐదుగురు జడ్జీల ధర్మాసనం తీర్పును వెల్లడించింది. అయోధ్యలోని వివాదపూరిత స్థలంలో రాముని ఆలయం కట్టుకోవచ్చని స్పష్టం చేసింది. ముస్లింల మసీదును కూల్చడాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం….అందుకు ప్రత్యమ్నాయంగా ఐదు ఎకరాల ల్యాండ్ ను కేటాయించాలని సూచించింది. దీనికి సంబంధించి ఒక స్కీమ్ ను రూపొందించాలని కేంద్రానికి సూచించింది.

సున్నీ వక్ఫ్ బోర్డ్ తరపున వాదించిన లాయర్..సుప్రీం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాని..దేశంలో ప్రజలు శాంతియుతంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

అయోధ్యపై తీర్పు తరువాత ప్రధాని మోదీ చేసిన ట్విట్, దేశభక్తిని బలోపేతం చేయాలన్న మోదీ

అయోధ్య తీర్పు కాంగ్రెస్ స్పందించింది..సుప్రీం కోర్ట్ తీర్పుకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చింది.

Congress ON AYODHYAVERDICT

1920లో అయోధ్య
Ayodhya Pic

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.