రాజ్యాంగానికి కట్టుబడి..రాజ్యాంగ పరిధిలో సుప్రీం కోర్ట్ మంచి తీర్పు ఇచ్చింది. మత విశ్వాసాలతో తమకు పని లేదని చాలా స్పష్టంగా పేర్కొంది. చారిత్రక ఆధారాలు, సాక్ష్యాలను మాత్రమే సుప్రీం కోర్ట్ పరిగణనలోకి తీసుకుంది. 134 ఏళ్లుగా జాతికి సమస్యగా మారిన 2.77 ఎకరాల వివాదాస్పద స్థలంపై ఆధారాలున్నవారికే తీర్పు అనుకూలంగా ఇచ్చింది. మూడు నెలల్లో అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు చేసి వారికి ..2.77 ఎకరాల భూమిని అప్పగించాలని సుప్రీం కోర్ట్ ఆదేశించింది. 1045 పేజీల తీర్పులో సుప్రీం చారిత్రక అంశాలు, అనేక ఘటనలను ప్రస్తావించింది. ఫైనల్‌గా పురావస్తు నివేదిక, చారిత్రక సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తీర్పు చదివితే అర్ధమవుతుంది.

అయోధ్య రామజన్మ భూమి అని హిందూవుల నమ్మకం. అలాగే..వివాదాస్పద స్థలంలో ఉన్న బావి నీటిలో అద్భుత శక్తులున్నాయని హిందూవులు, ముస్లింలు నమ్ముతారు. ఇదే విషయాన్ని..బ్రిటీష్ అధికారులు కూడా దృవికరించారు. ఈ నీటిలో ఉప్పు అనేది ఉండదు. తియ్యగా..చల్లగా ఉంటాయి. ఈ నీటి మీద అనేక జానపథ కథలు కూడా పుట్టుకొచ్చాయి. ఈ నీటిని అయోధ్యలోని ముస్లింలు, హిందూవులు ఎంతో పవిత్రమైందిగా భావిస్తారు.

1992 డిసెంబర్‌6న బాబ్రీ మసీద్ కూల్చిన రోజున అక్కడ ఒక శిలా శాసనాన్ని, 250 ఇతర కళాకృతులు స్వాధీనం చేసుకున్నారు. అవి ..అక్కడ ఒక దేవాలయం ఉందనే వాస్తవాన్ని తెలియజేస్తున్నాయని హిందూవులు వాదిస్తున్నారు.

మహంత్ రఘుబార్ దాస్ దాఖలుచేసిన దావాపై ఫైజాబాద్ జిల్లా న్యాయమూర్తి 1886 మార్చి 18న ఒక తీర్పును ప్రకటించారు. ఈ దావాను తోసిపుచ్చినప్పటికీ, తీర్పు రెండు సందర్భోచితమైన అంశాలను పేర్కొన్నది:

“బాబర్ చక్రవర్తి నిర్మించిన మసీదు అయోధ్య పట్టణ సరిహద్దుమీద ఉన్నట్లు నేను కనుగొన్నాను. హిందువులకు పవిత్రమైన స్థలంలో మసీదును నిర్మించడమే అత్యంత దురదృష్టకరమైన పరిణామం, కాని, ఈ ఘటన 358 సంవత్సరాల క్రితం జరిగినందున ఇప్పుడు పరిహారం చేయడం చాలా కష్టసాధ్యం. ఇప్పుడు చేయగలిగిందల్లా యధాతథ స్థితిని ఇరుపక్షాలూ కొనసాగించడమే. ప్రస్తుత సందర్భంలో ఈ కేసులో ఏ మార్పు చేసినా అది ప్రయోజనాన్ని ఇవ్వడానికి బదులుగా మరింత ప్రమాదాన్ని కొనితెస్తుంది.”

అప్పటి నుంచి కోర్ట్‌ల్లో అయోధ్య నానుతూనే ఉంది. ఇప్పుడు సమస్యకు పరిష్కారం దొరికింది. వివాదాస్పద స్థలాన్ని హిందూవులకు అప్పగించాని చెబుతూనే..మరోవైపు..సున్నీ బోర్డ్‌కు 5 ఎకరాల భూమిని కేటాయించాలని సుప్రీం కోర్ట్ ఆదేశించింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

2 comments on "అయోధ్యలో ఉన్న ఆ బావికి మహిమలున్నాయా..?"

  • అయోధ్యలో రామాలయ నిర్మాణం మరియు దాని వల్ల కలిగే ఉపయోగాలు ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటుంది అని తెలుసుకున్నాను నా మనసు మాట

Comments are closed.