ఢిల్లీ: అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై విచారణను అక్టోబరు 18 నాటికి పూర్తి చేయాల్సిందేనని సుప్రీంకోర్టు మరోసారి తేల్చిచెప్పింది. ఆలోగా ఇరు పక్షాలు వాదనలు వినిపించాలని, అంతకు మించి ఒక్కరోజు కూడా అదనంగా ఇవ్వడం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఆక్టోబర్ 18నాటికి వాదనలు పూర్తి కావాల్సిందేనన్నారు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్‌. ఆ తరువాత తీర్పు వెలువరించడానికి నాలుగు వారాల గడువు ఉంటుందన్నారు. ఆ నాలుగు వారాల్లో తీర్పు వెల్లడిస్తే న్యాయస్థానం అద్భుతం సాధించినట్లేనని అన్నారు రంజన్ గొగొయ్.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.