ఢిల్లీ: శతాబ్దాల వివాదం భారతీయ రాజకీయ వ్యవస్థనే కాదు..న్యాయ వ్యవస్థను కూడా వెంటాడుతుంది. బుధవారం కూడా సుప్రీం కోర్టు అయోధ్య కేసును విచారించింది. అక్టోబర్‌18న వాదనలు ముగుస్తాయని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అదే రోజున విచారణ ముగిస్తామని పేర్కొంది. అక్టోబర్‌ 18 తీర్పును రిజర్వ్ చేసే అవకాశముంది. నవంబర్‌ 17 చీప్‌ జస్టిస్ గొగొయ్ పదవి కాలం ముగియనుండటంతో..ఈలోపే తీర్పు వచ్చేఅవకాశముందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ లోపు సమస్య పరిష్కారం కోసం కమిటీ ప్రయత్నాలు చేయవచ్చని స్పష్టం చేసింది సుప్రీం కోర్ట్.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.