హెల్మైట్లు అయిపోయాయ్..ఇప్పుడు ఆటోల వంతు
By రాణి
కరోనా వైరస్ భారత్ లో పాగా వేసిన కొద్దిరోజులకే లాక్ డౌన్ విధించారు నరేంద్ర మోదీ. తొలిసారి విధించిన 14 రోజుల లాక్ డౌన్ లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. అత్యవసరమైతే గానీ బయటికి రావొద్దని చెప్పినా వినిపించుకోలేదు. ప్రజల తీరుతో విసిగిపోయిన చెన్నై పోలీసులు కరోనా హెల్మెట్లు ధరించి అవగాహన కల్పించడం మొదలు పెట్టారు. అనవసరంగా బయట తిరిగేవారి బైక్ లు ఎక్కి రౌండ్లు కొట్టి మరీ బయటికి రావొద్దు..మీకు దండం పెడుతాం అని విజ్ఞప్తి చేశారు. అలా హెల్మెట్లు అయిపోయాయి. ఇప్పుడు కరోనా ఆటోలొచ్చాయి.
Also Read : నాగబాబు కౌంటర్..విజయ సాయి రివర్స్ కౌంటర్
పోలీసులు తయారు చేయించిన ఈ కరోనా ఆటోలు చెన్నై నగరంలోని వీధుల్లో తిరుగుతూ కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తున్నాయి. వైరస్ తగ్గేంత వరకూ బయటికి రావొద్దని, దయచేసి ఇళ్లలోనే ఉండాలని చెప్తూ కరోనా ఆటోలను గల్లీ గల్లీకి తిప్పుతున్నారు చెన్నై పోలీసులు.